GHMC | అమీన్పూర్ మున్సిపాలిటీలో.. 3.36 కోట్లతో ల్యాండ్ స్కేపింగ్
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత కొత్తగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలు, ఇతర కార్పొరేషన్లలో అవసరమైన అభివృద్ధి పనుల కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటు ఆయా పనులను స్వయంగా చేపడుతున్నది.
GHMC | సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత కొత్తగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలు, ఇతర కార్పొరేషన్లలో అవసరమైన అభివృద్ధి పనుల కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటు ఆయా పనులను స్వయంగా చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ మహానగరం ఎవరూ ఊహించని విధంగా ఔటర్ రింగు రోడ్డు దాటి విస్తరిస్తున్నది.
ఈ నేపథ్యంలో పట్టణీకరణకు అనుగుణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా జీవ వైవిధ్యానికి ప్రాధ్యానిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు చెరువుల సుందరీకరణ, పార్కుల నిర్మాణం వంటి పనులను హెచ్ఎండీఏ చేపడుతున్నది. తాజాగా గ్రేటర్ శివారులోని అమీన్పూర్ మున్సిపాలిటీలో 2 చోట్ల ఉన్న చెరువులు, మరో 2 పార్కుల అభివృద్ధికి మొత్తం రూ. 3.36 కోట్ల నిధులతో ల్యాండ్ స్కేపింగ్ పనులను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం చేపట్టనున్నది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ చెరువుల సరిహద్దులను నిర్ణయించి వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతుండగా, ఆయా చెరువులన్నీ స్థానికులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు వాటిని అందమైన పచ్చిక బయళ్లతో తీర్చిదిద్దుతున్నది హెచ్ఎండీఏ.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

