ఘట్కేసర్,డిసెంబర్28:పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని సంస్కృతి టౌన్షిప్ అభివృద్ధికి సహకారం అం దించాలని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరిప్రసాద్‌రావు కోరారు. బుధవారం మంత్రి నివాసంలో కలిసి టౌన్షిప్ సమస్యలపై ఆయనవినతిపత్రం అందజేశారు.టౌన్షిప్లో చాలా కాలం గా ప్రభుత్వం, హౌసింగ్ బోర్డుల నుంచి పలు సౌకర్యాలు కల్పించాల్సి ఉందని గుర్తు చేశారు. క్లబ్ హౌస్,కమ్యూనిహలు,దుకాణ సముదాయం,రవాణా సౌకర్యం,తదితర సౌకర్యాలు టౌన్‌షిప్‌కు రావాల్సి ఉందని అధ్యక్షుడు హరిప్రసాద్‌రావు మంత్రికి వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతకు ముందు మంత్రి హరీశ్‌రావును శాలువా కప్పి హరిప్రసాద్‌రావు సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ హన్మంత్‌రావు పాల్గొన్నారు.