CS Shanti Kumari | మహిళా జర్నలిస్టులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు: సీఎస్ శాంతి కుమారి
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు (Free medical camps) నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు (Free medical camps) నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) అన్నారు. నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని సమాచార కమిషనర్
కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సీఎస్ శాంతి కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్‌లో భాగంగా 36 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉచిత ఆరోగ్యపరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, కంటివెలుగు పరీక్షలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు లాంటి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, దీంతో మాతా, శిశు మరణాల రేటును తగ్గించడంలో తెలంగాణ ముందున్నదని పేర్కొన్నారు. కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమంలో కోటిన్నర మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, 45 లక్షల మందికి కంటి అద్దాల పంపిణీ చేశామన్నారు. రెండోదశ కంటి వెలుగు కార్యక్రమంలో కోటి 70 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
మహిళా జర్నలిస్టులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) మహిళా దినోత్సవం రోజున ఆదేశించారని, ఈ మేరకు ఆరోగ్య శిబిరం ప్రారంభిస్తున్నామని సీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్రిడిటెడ్ మహిళా జర్నలిస్టుల కోసం మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్లో 10 రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
పదిరోజుల పాటు వైద్య శిబిరం..
గురువారం నుంచి నుండి ఏప్రిల్ 9 వరకు అంటే పది రోజుల పాటు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో పనిచేస్తున్న గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మాస్టర్ హెల్త్చెకప్లో భాగంగా రక్త పరీక్ష (CBP), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేస్తారని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

