కొన్నాళ్లపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి

- వైరస్ సోకిన వారం రోజుల్లో ప్రభావం
- ఊపిరితిత్తుల్లోకి చేరితే ప్రమాదం
- అన్నిరకాల వ్యాక్సిన్లు మంచివే
- గాంధీ దవాఖాన పల్మనాలజీ నిఫుణుడు డాక్టర్ కృష్ణమూర్తి
కరోనా మొదటి దశకు, రెండోదశ వైరస్‌లో చాలా మార్పులున్నాయని, శరీరంలో ప్రవేశించిన వైరస్ ఊపిరితిత్తుల్లో చేరితే వారంరోజుల్లో తీవ్రరూపం దాల్చుతుందని గాంధీ దవాఖాన పల్మనాలజీ నిఫుణుడు డాక్టర్ కృష్ణమూర్తి వెల్లడించారు. రెండోదశ కరోనా అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్నదని, నలుగురిలో కలువకపోడమే చాలా ఉత్తమమని సూచించారు.
అందరూ వ్యాక్సిన్ వేసుకోగలిగితే మూడోదశ కరోనా వ్యాప్తి ప్రభావం తక్కువగా, ప్రమాదరహితంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జ్వరం, తలనొప్పి, దగ్గు వంటివి వస్తే ఆలస్యం చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో వేగం పెరగడం వంటివి గమనిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి, శ్వాస సంబంధిత అంశాలపై పలువురిలో నెలకొన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు.
- కరోనా సోకితే శ్వాస సమస్య ఎలా ఉంటుంది? కరోనా సోకిన వారికి ప్రాథమికంగా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. జ్వరం, ఒళ్లునొప్పులు, నీరసం, గొంతునొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, కొద్దిమందిలో విరేచనాలవుతాయి. కొందరిలో వాసన లేకపోవడం, రుచి తెలియకపోవడం కనిపిస్తుంది. ముక్కు లేదా గొంతు ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే వ్యాధి తీవ్రత పెరుగుతుంది.
- కరోనాకు చికిత్స విధానాలేమిటి ? కరోనా తీవ్రత బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, క్రిటికల్ అని నాలుగురకాలుగా చెప్పొచ్చు. స్వల్ప లక్షణాలున్న వారు హోం ఐసోలేషన్‌లో ఉండి నయం కావొచ్చు. మోడరేట్ లక్షణాలున్నవారు ఆక్సిజన్ సౌక ర్యం ఉన్న ఆస్పత్రిలో చేరాలి. సివియర్ లక్షణాలున్న వారిలో తీవ్రమైన శ్వాస సమస్య ఉంటే ప్రాణవాయువు అందించాల్సి ఉంటుంది. క్రిటికల్ కేసుల వారికి వెంటిలేటర్ ద్వారా ప్రాణవాయువు ఇవ్వాలి.
- ప్రాణవాయువును ఏ సందర్భంలో అందిస్తారు? కరోనా సోకిన వారం రోజుల్లో తీవ్ర ప్రభావం కనబడుతుంది. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగం పెరగడం ఉబ్బసం, దగ్గు లక్షణాలు కనబడుతాయి. తీవ్రత పెరిగిన కొద్దీ..ఆక్సిజన్ శాచురేషన్ తగ్గుతూ ఉంటుంది. ఆక్సిజన్ శాతం 94 కన్నా పడిపోతే వారికి ప్రాణవాయువు అందించాల్సి ఉంటుంది.
- కోలుకున్న వారిలో శ్వాస సమస్యలుంటాయా? కరోనా చికిత్స పొంది కోలుకున్న వారిలో అందరికీ సమస్యలుండవు. వ్యాధి తగ్గిన వారిలో కొద్దిశాతం మందిలో ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మార్పులు రావొచ్చు. వారిలో పలు బ్రాంకైటీస్ లక్షణాలు సోర్ లొరిడ్ ఫిబ్రోసిస్ వంటి వాటి ప్రభావం తరుచుగా చూస్తాం.
- కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం ? కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండూ మంచివే. ఎలాంటి అపోహలు లేకుండా అర్హులంతా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ కరోనా వచ్చినా కూడా వ్యాధి తీవ్రత తగ్గడం, ప్రాణాంతక పరిస్థితులు రాకుండా టీకా నియంత్రిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించాలి. చేతులను శుభ్రపరచుకోవాలి.
- ఫ్రంట్లేన్ వారియర్‌గా మీ సేవలు ఎలా ? కరోనా ప్రత్యేక కేంద్రంగా సేవలందిస్తున్న గాంధీ దవాఖానలో ఫ్రంట్లేన్ వారియర్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. కొవిడ్ ప్రత్యేక దవాఖానగా సేవలందిస్తున్న గాంధీలో ఎంతోమందిని ఈ వైరస్ నుంచి బయటపడేసేందుకు ఒక సేవకుడిగా, ఒక వైద్యుడిగా అవకాశం వచ్చినందుకు చాలా సంతృప్తి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Covid precautions
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

