ఆ ప్రాంతాల్లోనే.. ఎక్కువ వైరస్

- బాధ్యత మరిచి.. బయట తిరుగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
- కొవిడ్‌కు అడ్డాగా పలు ప్రాంతాలు g వైరస్ వ్యాప్తి అక్కడే ఎక్కువ
- అక్కడకు వెళ్లకపోవడమే ఉత్తమం
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. రోజురోజుకూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. పక్కనున్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా.. చీదినా వెన్నులో వణుకుపుడుతున్నది. వైరస్ బారిన పడిన వారిని కుటుంబసభ్యులే దరిచేరనీయని దుస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కొందరు సామాజిక బాధ్యతను విస్మరించి.. ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. వారే కాకుండా తమ కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్లిన వారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే క్షేమదాయకమని పోలీసులు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లితే ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారు.
హైరిస్క్ ప్రాంతాలు..
- జిమ్ సెంటర్లు
- అమ్యూజ్మెంట్ పార్క్‌లు, పర్యాటకప్రాంతాలు
- సినిమా హాళ్లు g మతపరమైన కార్యక్రమాలు
- బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు
- ప్రయాణ ప్రాంగణాలు g హెయిర్ సెలూన్లు g విమాన ప్రయాణాలు
- ఫంక్షన్ హాళ్లు. వివాహాది వేడుకలు
- వారాంతపు సంతలు
- వైద్యశాలలు
- పబ్లిక్ టాయిలెట్లు.
వైరస్ సోకే రిస్క్ కొద్దిగ తక్కువున్న సందర్భాలు
- షాపింగ్ మాల్స్
- పిల్లలను స్కూల్స్, డే కేర్, క్యాంపులకు పంపడం
- స్విమ్మింగ్ పూల్స్
- ఆఫీస్ బిల్డింగ్‌లో వరుసగా వారం రోజుల పాటు పనిచేయడం
- ఫ్రెండ్స్‌ను కలువడం
- ఇతరులతో ఇంట్లో కలిసి భోజనం చేయడం
రిస్క్ మరీ తక్కువున్న సందర్భాలు
- కిరాణా షాపులకు వెళ్లడం.
- ఇతరులతో కలిసి నడవడం, పరుగెత్తడం, ద్విచక్రవాహనాలపై వెళ్లడం.
- క్రీడా ప్రాంగణాలు.
- లైబ్రరీలు, మ్యూజియాలు.
- రెస్టారెంట్లో కాకుండా బయట తినడం.
- పేపర్లు చదవడం.
- బ్యాడ్మింటన్ ఆడటం.
పాటించాల్సిన జాగ్రత్తలు
- ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాలకు, జన రద్దీ చోట్లకు వెళ్లకుండా దూరంగా ఉండాలి.
- ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలి..
- తక్కువ ప్రభావం చూపే ప్రాంతాలకు వెళ్లినా మాస్క్ ధరించాలి.
- ఇంటికి వచ్చాక శానిటైజ్ చేసుకోవాలి. వీలైతే స్నానం చేయాలి.
- ఇంటికి ఎవరు వచ్చినా ముందుగా వారిని శానిటైజ్ చేసుకోమని తెలుపాలి.
- మాస్క్ ధరించని అపరిచితులు, సుపరిచితులకు దూరంగా ఉండాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Covid precautions
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

