నువ్వక్కడ నేనిక్కడ
- భార్యా భర్తల మధ్య కొవిడ్ తెచ్చిన ఎడబాటు
- ఉద్యోగం కోసం నగరాల్లోనే పళ్లైన బ్యాచిలర్స్
- కరోనా భయానికి కుటుంబ సభ్యులను సొంతూళ్లకు పంపిస్తున్న వైనం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మనుషుల జీవితాలపై కరోనా తన ప్రభావం చూపిస్తున్నది. ముఖ్యంగా ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేస్తున్నది. నిన్న మొన్నటి వరకు లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన వారంతా ప్రస్తుతం సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవన విధానమే పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నగరాల్లో ఉంటూ వారి కుటుంబ సభ్యులను మాత్రం సొంతూళ్లకు పంపుతున్నారు. ఇలా చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. నగరంలో ఉంటే మహమ్మారి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ భార్య, పిల్లలను ఊరి బాట పట్టించారు. భర్తలు మాత్రం ఉద్యోగం కారణంగా ఇక్కడే ఉండిపోతున్నారు. మరోసారి బ్యాచిలర్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.
కొవిడ్ ఎడబాటు..
- సాధారణంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు ఎడబాటుకు కారణమవుతాయి.
- కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. భార్య, పిల్లలపై ఉన్న ప్రేమతో వారిని ఇంటికి పంపిస్తూ తాత్కాలిక ఎడబాటును అనుభవిస్తున్నారు.
- గ్రామాల్లో అయితే పెద్దగా కరోనా ప్రభావం లేకపోవడం ఇందుకు కారణమవుతున్నది.
- అంతేకాదు కొవిడ్ సంక్షోభంతో కొందరు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.
- ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారిపై కొవిడ్ ప్రభావం పడింది.
- ఈ క్రమంలో ఇక్కడే ఉంటూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకునే బదులు సొంతూరుకు వెళ్లడమే మంచిదనే భావించే వారి సంఖ్య పెరిగింది.
మరోసారి బ్యాచిలర్ లైఫ్..
- నగరంలో ఉద్యోగం చేస్తున్న భర్తలు కొవిడ్ ప్రభావంతో బ్యాచిలర్‌గా మారాల్సి వచ్చింది.
- కుటుంబం సొంతూరుకు వెళ్లడంతో ఇంట్లో ఏక్ నిరంజన్ అవతారమెత్తారు.
- వంట చేసుకోవడం.. ఇల్లు శుభ్రం చేసుకోవడం.. బట్టలు ఉతకడం.. తదితర పనులన్నీ చేస్తున్నారు.
- బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయంటూ ఐటీ ఉద్యోగి గోపరాజు అన్నారు.
- కొవిడ్ భయం కారణంగా తన కుటుంబాన్ని సొంతూరుకు పంపించానని తెలిపారు.
- లాక్డౌన్ నుంచి ఇప్పటికీ తమ కుటుంబం ఊళ్లోనే ఉందని మెడికల్ స్టోర్ నిర్వాహకుడు రఘు తెలిపారు.
- ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది తమ కుటుంబ సభ్యులను సొంతూరుకు పంపించారు.
- ఈ వరుసలో పోలీసు, వైద్యులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు.
- వివాహం అయ్యి ఏడాదైన కానిస్టేబుల్ యాదగిరి తన భార్యను లాక్డౌన్ నుంచి తమ సొంతింటికి పంపించానని వివరించారు.
- విధుల్లో భాగంగా కొవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలిపారు.
ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి భయం లేదు..
కొవిడ్ భయంతో కుటుంబాన్ని సొంతూరుకు పంపించా. విధి నిర్వహణలో భాగంగా రెండు నెలల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం నేను ఒక్కడినే ఇంట్లో ఉంటున్నందున ఎలాంటి భయం లేదు. నేను కొవిడ్ బారిన పడిన నా నుంచి కుటుంబ సభ్యులకు సోకుతుందన్న భయం లేదు. – రాజీవ్ విలియమ్స్, వ్యాపారవేత్త.
ఆఫీస్ పని కన్నా ఇంటి పనే భారం
మహమ్మారి విజృంభణతో నా కుటుంబ సభ్యులు సొంతూరికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ప్రతి పని నేనే చేసుకోవాల్సి వస్తున్నది. బయట ఫుడ్ ఆర్డర్ చేద్దామంటే వైరస్ భయం. ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్లి అన్ని పనులు చేసుకోవాల్సి రావడం భారంగా మారింది. నిజంగా నా వైఫ్ ఎంత కష్టపడుతుందో ఇప్పుడు తెలిసొచ్చింది. ఆమెకు హ్యాట్సాఫ్. – వెంకీ, ఉద్యోగి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Covid effect
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

