నగరమా..ఊపిరి పీల్చుకో

- మందుల కిట్లు, లాక్డౌన్, ఫీవర్ సర్వేతో సత్ఫలితాలు
- కట్టుదిట్టమైన కట్టడితో కొవిడ్‌కు కళ్లెం
- రెట్టింపు రికవరీలు.. ఖాళీగా బెడ్లు
- తగ్గుతున్న ఇన్ పేషెంట్ల సంఖ్య
- ‘కొండాపూర్’ దవాఖానలో 90% పడకలు ఖాళీ
- 110 బెడ్లకు 15 మంది మాత్రమే
నగరంలో కరోనా ఉధృతి నియంత్రణలోకి వస్తున్నది. వైరస్వ్యాప్తి తగ్గుతుండగా, బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. లాక్డౌన్, ఇంటింటికీ ఫీవర్ సర్వే, మందుల కిట్ల పంపిణీతో మహమ్మారికి మూకుతాడు పడుతున్నది. గత నెలలో ఒక్కసారిగా బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్ల కోసం పేషెంట్లు అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొవిడ్‌కు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. టెస్టుల సంఖ్యను బాగా పెంచింది. ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్న వారిని గుర్తించి.. మందుల కిట్లు అందజేస్తుండడంతో హోం ఐసొలేషన్లలోనే వైరస్ కట్టడవుతున్నది. దీనికితోడు లాక్డౌన్ కఠినంగా అమలు చేయడంతో జనం బయట తిరగడం తగ్గిపోయింది. ‘స్టే హోం..స్టే సేఫ్’ సూత్రాన్ని పాటిస్తుండటంతో పాజిటివిటీ రేటులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్నది. కాగా, లాక్‌డౌన్‌కు ముందు కొండాపూర్‌లోని జిల్లా దవాఖానలో బెడ్లు దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సుమారు 90 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. 110 బెడ్లలో కేవలం 15 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.
కొండాపూర్, మే 31: కొవిడ్-19 మహమ్మారి ఈసారి ప్రపంచ దేశాలేమో కాని, భారతావనిపైనే అధికంగా ప్రభావం చూపింది. అయితే, దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గత నెలలో దవాఖానల్లో పడకలు దొరకక ఇబ్బందులకు గురవ్వగా, ప్రస్తుతం, ఇన్ పేషెంట్లు లేక పడకలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే, ప్రభుత్వ దవాఖానల్లో అందజేస్తున్న మెరుగైన వైద్య సౌకర్యాలతో కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎంతో మేలు చేకూరుతున్నదని వైద్యులు చెబుతున్నారు. జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి, అక్కడే కరోనా కిట్స్ అందజేసి జాగ్రత్తలు తెలుపుతుండటంతో దవాఖాన అవసరం లేకుండానే ఇంట్లోనే వైరస్ కట్టడవుతున్నది. దీంతో పాటుగా వైరస్ వ్యాప్తి సైతం అదుపులోకి వస్తున్నది. కాగా, లాక్‌డౌన్‌కు ముందు కొండాపూర్‌లోని జిల్లా దవాఖానలో పడకలు ఖాళీలు లేక పేషెంట్లను గాంధీ, టిమ్స్‌కు పంపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం, పేషెంట్లు లేక దాదాపు 90శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి.
జిల్లా దవాఖానలో 110 పడకల్లో 15 మందే..
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో 110 పడకలు కొవిడ్ వైద్యం కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులో కొవిడ్ జనరల్ బెడ్స్ 10, ఆక్సిజన్ బెడ్స్ 62, ఐసీయూ బెడ్స్ 10, వెంటిలేటర్ బెడ్స్ 28 అందుబాటులో ఉండగా, వీటిలో కేవలం 15 మంది ఆక్సిజన్ జనరల్ బెడ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, దవాఖానలో ప్రస్తుతం వెంటిలేటర్, ఐసీయూ, జనరల్‌తో కలిపి 95 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
మెరుగైన సేవలందిస్తున్నాం
- దవాఖానలో కొవిడ్ వైద్య సేవలందిస్తున్నప్పటికీ ఓపీ, గర్భిణీ, ప్రసవాల సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
- మరో వైపు వ్యాక్సినేషన్, కొవిడ్ టెస్టులను కొనసాగిస్తున్నాం.
- కొవిడ్ సేవల కోసం ప్రత్యేకంగా 50మంది వైద్య సిబ్బందితో పేషెంట్ల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన సేవలందిస్తున్నాం.
- ఐసీయూ, వెంటిలేటర్లతో పాటు ఆక్సిజన్ పడకలు 90 శాతం ఖాళీగా ఉన్నాయి.
- నెల రోజుల కిందట చేరిన కొవిడ్ పేషెంట్లు దాదాపు డిశ్చార్జీ కాగా, కేవలం 15మంది జనరల్ ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్నారు.
- వారంలో వారు కూడా డిశ్చార్జీ అవుతారు. – డాక్టర్ వరదాచారి, సూపరింటెండెంట్, రంగారెడ్డి జిల్లా దవాఖాన, కొండాపూర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Covid effect
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

