Food Delivery Boy | ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కొన్నిసార్లు సమయానికి కాకుండా ఆలస్యంగా వస్తుండటం సాధారణంగా జరిగే విషయమే. అయితే ఆర్డర్ ఆలస్యమైనప్పుడు ఓపికతో ఫుడ్‌ను డెలివరీ బాయ్ నుంచి తీసుకునేవారు కొందరైతే… కోపంతో ఫుడ్‌ను ఆలస్యంగా తీసుకొస్తావా అంటూ విరుచుకపడేవారు మరికొందరు. సికింద్రాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.
ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దంపతులు డెలివరీ బాయ్‌పై దాడి చేశారు.. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ వాసవినగర్‌లో చోటుచేసుకుంది.. లొకేషన్ తప్పుగా చూపించడంతో ఫుడ్ ఆర్డర్ లేట్ అయిందని చెప్పినా వినకుండా జొమాటో డెలివరీ బాయ్ ఆశిపై దంపతులు దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఫుడ్ డెలివరీ బాయ్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్..!
ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ వాసవినగర్‌లో ఘటన
లొకేషన్ తప్పుగా చూపించడంతో ఫుడ్ ఆర్డర్ లేట్ అయిందని జొమాటో డెలివరీ బాయ్ ఆశిపై దంపతులు దాడి
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు https://t.co/sxvknxSfsI
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026