ముప్పు తప్పాలంటే.. నిర్లక్ష్యం వీడండి

- నిబంధనల బేఖాతర్తోనే కరోనా ముప్పు
- ప్రమాదకరంగా కరోనా సెకండ్ వేవ్
- పెరుగుతున్న పాజిటివ్ కేసులు మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పక్కా చర్యలు
- వేగంగా పరీక్షలు, వ్యాక్సినేషన్
- రాత్రి కర్ఫ్యూతో తగ్గనున్న వ్యాప్తి
- ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో పడకలు
మాస్కులను పూర్తిగా ధరించడం.. సమూహాల్లో తిరగకపోవడం.. బయటకెళ్లినప్పుడు భౌతికదూరం పాటించడం.. తరుచూ చేతులను శుభ్రం చేసుకోవడం.. సమయానికి చక్కటి ఆహారం తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వందశాతం దరిచేరదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది నిబంధనలు బేఖాతర్ చేయడం, లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకపోవడం, వైరస్‌తో బయట తిరగడం వల్ల వేగంగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొంటున్నారు. కరోనా స్వల్ప లక్షణాలుంటే ఇంట్లో ఉండడమే మేలని, అనవసరంగా ఆస్పత్రులకు పరుగులు తీయొద్దని సూచిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల కొరతకు ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. మొదటిదశ కన్నా, రెండోదశ వైరస్ రంకెలేస్తుండడంతో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఓ వైపు నిర్ధారణ పరీక్షలు పెంచుతూనే మరోవైపు టీకాలను సాధ్యమైనంత ఎక్కువమందికి అందిస్తున్నది. కాగా రెండోరోజు బుధవారం రాత్రి కర్ఫ్యూ సజావుగా సాగింది. ప్రజలు ముందే అప్రమత్తమై రాత్రి 9 గంటలకల్లా ఇండ్లకు చేరారు.
గ్రేటర్‌వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుండడం కలకలం రేపుతున్నది. గతేడాది మొదటిదశ కరోనా కన్నా, రెండోదశ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో కట్టడికి ప్రభుత్వం, వైద్యాధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఒకవైపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే మరోవైపు నియంత్రణకు టీకాల ప్రక్రియను చురుగ్గా కొనసాగిస్తున్నారు. వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు బారులు తీరుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తూ కావాల్సిన మందులు అందిస్తుండగా, పరిస్థితి ఇబ్బందిగా ఉన్న వారిని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానాగా మార్చారు. వీటితోపాటు ఎర్రగడ్డలో ఛాతి, ప్రభుత్వ ఆయుర్వేద, ఇతర ప్రభుత్వ దవాఖానాలలో ఉన్న పడకల సంఖ్యను రెట్టింపు చేసి బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు.
ఒక్కరికొస్తే వేగంగా వ్యాప్తి
- కరోనా వైరస్ మ్యుటేషన్ (మార్పు) వేగంగా ఉంటుండడంతో ఎవరి నుంచి ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ..వారి కుటుంబసభ్యులకు, చుట్టుపక్కల వారికి వైరస్‌ను అంటగడుతున్నారు.
- ప్రధానంగా వైరస్ సోకిన వారిలో చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో పరీక్షలు చేయించుకోకుండా ఇష్టానుసారం తిరుగుతున్నారు.
- కొంతమంది పాజిటివ్ వచ్చినా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నారు.
రెండోదశలో యువతకే అధికం
- కరోనాను చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారని, కరోనా వచ్చి పోతుందంటూ అవగాహన రాహిత్యంతో ముందు జాగ్రత్తలు పాటించడం లేదు.
- ప్రధానంగా యువత కొవిడ్ బారిన పడుతున్నది.
- ఉద్యోగ, వ్యాపార రీత్యా, ఇతర అత్యవసర పనిమీద వస్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
- అవసరం లేకుండా బయటకు రావొద్దని, సమూహాల్లో తిరగకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని చెబుతున్నారు.
అసత్య ప్రచారం నమ్మొద్దు
- కరోనా చికిత్సకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు లేవని చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు.
- అన్నిచోట్ల సదుపాయాలు బాగా ఉన్నాయి.
- సుశిక్షుతులైన వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
- రోగుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
సలహాల కోసం..
- కరోనా సోకిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
- ఎలాంటి మందులు వాడాలి ?
- ఇతర సమస్యలు, సలహాల కోసం 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
- ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబోరేటరీల వల్ల సమస్యలు ఎదురైతే 9154170960 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
మరో నాలుగు వారాలు బాధ్యతగా ఉండాలి
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. పరీక్షలు, టీకా ప్రక్రియను వేగవంతం చేశాం. వచ్చే మూడునాలుగు వారాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా నిబంధనలు పాటించాలి. విధిగా మాస్క్ ధరించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు. -డాక్టర్ వెంకటి, డీఎంహెచ్‌వో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

