నిర్మాణదారులను బెదిరిస్తూ.. కాంగ్రెస్ నేత వసూళ్లు
తాజాగా సూరారంకాలనీ, భవానినగర్ నివాసి మేస్త్రీపని చేసుకునే కే. నర్సింహులు అనే వ్యక్తి జీ+2 అనుమతులతో సొంతింటిని నిర్మించుకుంటున్నాడు. అయితే అనుమతులకు మించి అదనంగా మరో అంతస్తు నిర్మిస్తుండటంతో రాజుచారి నర్సింహులును బెదిరించి తనకు రూ.2లక్షలు ఇవ్వాలన్నాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
నిర్మాణదారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకుడిపై సూరారం పోలీసులు ఎక్స్టార్షన్ కేసు నమోదు చేశారు.పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబానగర్ డివిజన్ కాంగ్రెస్ నేత రాజుచారి(52) సూరారం కాలనీ పరిసర ప్రాంతాలల్లో ఇంటి నిర్మాణదారులను బెదిరింపులకు గురిచేస్తూ.. పెద్దాయనను కలవాలంటూ నిర్మాణదారులను భయపెడుతూ.. కొంతకాలంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడు. తన మాట వినని వారిపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ..తన అధికారాన్ని ఉపయోగించి వారితో ఇండ్లను కూల్చివేయిస్తూ నిర్మాణదారుల వద్ద అందిన కాడికి దండుకుంటున్నాడు.
దుండిగల్, అక్టోబర్ 14 : తాజాగా సూరారంకాలనీ, భవానినగర్ నివాసి మేస్త్రీపని చేసుకునే కే. నర్సింహులు అనే వ్యక్తి జీ+2 అనుమతులతో సొంతింటిని నిర్మించుకుంటున్నాడు. అయితే అనుమతులకు మించి అదనంగా మరో అంతస్తు నిర్మిస్తుండటంతో రాజుచారి నర్సింహులును బెదిరించి తనకు రూ.2లక్షలు ఇవ్వాలన్నాడు. లేనిపక్షంలో జీహెచ్ఎంసీ అధికారులతో ‘నీ ఇంటిని కూలగొట్టిస్తానం’టూ ఫోన్చేసి బెదిరించాడు. తక్షణమే తనను కలువాలని, లేని పక్షంలో పెద్దాయన ఊరుకోడంటూ హెచ్చరించారు. దీంతో బెదిరిపోయిన నర్సింహులు అంతమొత్తం చెల్లించడం తనవల్ల కాదని, రూ.50వేలు మాత్రమే ఇస్తానని వేడుకున్నాడు. అంగీకరించని రాజుచారీ నర్సింహులు నిర్మిస్తున్న భవనం ఫొటోలను ఫోన్లో తీసుకుని కొంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అధికార పార్టీ నేత కావడంతో పాటు ఆయన వెనుక ఉన్న పెద్దమనిషి పేరు చెబుతుండటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం రాజుచారి ఫిర్యాదును ఆసరాగా చేసుకుని మంగళవారం నర్సింహులు నిర్మించిన అదనపు అంతస్తును కూల్చివేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నర్సింహులు భార్య తీవ్ర అస్వస్థతకు గురై వైద్యశాలలో చేరింది. కాగా, రాజుచారి డిమాండ్ చేసిన మాటలన్నింటినీ ఫోన్లో రికార్డు చేసిన నర్సింహులు ఆధారాలతో సహా సూరారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో రాజుచారిపై పోలీసులు ఎక్స్టార్షన్(బలవంతపు వసూళ్లు) కేసు నమోదు చేసినట్లు సీఐ బాలరాజు స్పష్టం చేశారు. సూరారం కాలనీ పరిసర ప్రాంతంలోని నిర్మాణదారులను బెదిరింపులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న రాజుచారీ వెనుక ఉన్న పెద్దమనిషి ఎవరు అనేది స్థానికంగా చర్చనీయంశంగా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

