వెండితెర పండుగ

- తెరుచుకున్న సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు
- తొలిరోజు రద్దీ అంతంత మాత్రమే
- పక్కాగా కొవిడ్ నిబంధనలు అమలు
- సినిమా హాళ్ల వద్ద ప్రేక్షకుల సందడి
- గ్రేటర్లో 150 మల్టీప్లెక్స్, 160 సింగిల్ స్క్రీన్లు
- కొవిడ్ పరిస్థితులతో ఇన్నాళ్లు మూత
- మళ్లీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్
- త్వరలో పెద్ద సినిమాలవిడుదల తేదీలు ప్రకటించే అవకాశం
సిటీబ్యూరో, జూలై 30 ( నమస్తే తెలంగాణ ) : సిటీలో థియేటర్లు శుక్రవారం నుంచి మళ్లీ తెరుచుకోవడంతో సినీ కోలాహలం మొదలైంది. ఎప్పుడెప్పుడా అని కొన్ని రోజులుగా ఎదురుచూసిన ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనం థియేటర్ల బాట పట్టారు. వెండితెరపై వెలుగులను ఆస్వాదించారు. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడిన విషయం తెలిసిందే. ఫలితంగా సగటు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ లేక సతమతమయ్యారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం వంద శాతం అక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో మళ్లీ సినీ పండుగ షురువైంది. తొలి రోజు నరసింహపురం, ఇష్క్, తిమ్మరసు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, పరుగెత్తు పరుగెత్తు.. తదితర చిత్రాలు విడుదలయ్యాయి.
అయితే ఇప్పటికే సార్పట్ట, నారప్పలాంటివి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లలో ప్రేక్షకుల స్పందన బట్టీ పెద్ద సినిమాల విడుదల తేదీలు ప్రకటించే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.
కరోనా నిబంధనలు..
ప్రతీ థియేటర్ వద్ద కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. ఎంట్రీలో ఆటోమెటిక్ శానిటైజింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. టెంపరేచర్ చెక్ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. వంద శాతం అక్యుపెన్సీ కావడంతో ప్రతీ సీటు ఆవరణను పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ షోకు శానిటైజేషన్ తప్పనిసరిగా చేస్తున్నారు.
ఆదాయం ఇలా.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మొత్తం 150 మల్టీప్లెక్స్‌లు, 160 సింగిల్స్క్రీనింగ్ థియేటర్లు ఉన్నాయి. పీవీఆర్, ఇనార్బిట్ వంటి వాటిలో 150 వరకు సీట్లు ఉంటాయి. ఐమాక్స్ వంటి వాటిలో 400 వరకు సీటింగ్ కేపాసిటీ ఉంది. టికెట్ ధర రూ.150 అనుకుంటే .. 150 ఉన్న మల్టీప్లెక్స్‌లకు ఒక షోకు 22,500 వరకు ఆదాయం లభిస్తుంది. 400 సీట్లున్న మల్టీప్లెక్స్‌లో ఒక షోకు రూ.60 వేలకుపైగానే రాబడి ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో సీటింగ్ కెపాసిటీ 300 నుంచి 400 వరకు ఉంటే.. టికెట్ ధరలు గ్రేడ్‌ను బట్టీ ఉంటాయి. అయితే థియేటర్లు ఆడియన్స్‌తో పూర్తిగా నిండినప్పుడే ఆశించిన ఆదాయం వస్తుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Cinema halls
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

