Charminar | హైదరాబాద్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన చార్మినార్‌కు మెయింటెనెన్స్ పనులు అధ్వానంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన చార్మినార్ పట్ల పురావస్తు శాఖ నిర్లక్ష్య ధోరణితో చార్మినార్‌కు శాపంగా మారుతున్నది. చార్మినార్ మొదటి అంతస్తు నుంచి మరమ్మతులో ఉన్న పువ్వులు ఊడి కిందపడిపోయాయి. రాత్రి సమయం కావడం వల్ల పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
గతంలో ఒకసారి ఊడిపడిన మక్కా మసీదు వైపు పెచ్చులు, మరోసారి ఊడిపడిన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు పెచ్చులు ఊడిపడ్డాయి. ఇప్పుడు మళ్లీ చార్మినార్ పెచ్చులు ఊడిపడడంతోపర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చే చార్మినార్‌పై పురావస్తు శాఖ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.