సిటీలో చుడీదార్ గ్యాంగ్ హల్చల్
హైదరాబాద్‌లో గతంలో చెడ్డీ గ్యాంగ్ హాల్చల్ చేసింది. నేడు చుడీదార్‌తో కూడిన బుర్కా గ్యాంగ్ హాల్చల్ చేస్తోంది.. ఆడవారి వేషంలో అపార్టుమెంట్లలోకి చొరబడి.. తాళం వేసి ఉన్న ఇండ్లను లూటీ చేస్తున్నారు. ఈ కొత్త తరహా నేరం హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో ఉన్న జెక్కాలనీలో ఆదివారం జరిగిన విషయం తెలిసిందే.
- మహిళల వేషధారణలో దొంగతనాలు.. మహిళలా..? పురుషులా..? పోలీసుల ఆరా
- సిటీలో సర్వత్రా చర్చనీయాంశంగా ఎస్ఆర్నగర్ చోరీ ఘటన
సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో గతంలో చెడ్డీ గ్యాంగ్ హాల్చల్ చేసింది. నేడు చుడీదార్‌తో కూడిన బుర్కా గ్యాంగ్ హాల్చల్ చేస్తోంది.. ఆడవారి వేషంలో అపార్టుమెంట్లలోకి చొరబడి.. తాళం వేసి ఉన్న ఇండ్లను లూటీ చేస్తున్నారు. ఈ కొత్త తరహా నేరం హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో ఉన్న జెక్కాలనీలో ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. జెక్ కాలనీలోని ఆకృతి ఆక్రేడ్లో ఉన్న 502 ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటంతో.. తాళాలు పగలగొట్టిన చుడీదార్ గ్యాంగ్ ఆ ఇంట్లో నుంచి నగదు, నగలు అపహరించుకుపోయింది. నగరంలో తిరిగి రోజు రోజుకూ దొంగతనాలు, స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో స్నాచింగ్, దొంగతనాలను పూర్తిస్థాయిలో కట్టడిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరాల కట్టడికి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల దొంగతనాలు, స్నాచింగ్‌లు పెరగడమే ఇందుకు నిదర్శనం.
ఎస్ఆర్నగర్లోని అపార్టుమెంటులో చుడీదార్ ధరించి ఒకరు బుర్కా, మరొకరు ముఖానికి స్కార్ప్ కట్టుకొని చొరబడ్డారు. దొంగలు అపార్టుమెంటులో తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే, మగవాళ్లే ఆడవారి దుస్తులు వేసుకొని వచ్చి ఉంటారా..? ఆడవాళ్లే వచ్చారా..? అనే అంశంపై పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మగవాళ్లే ఆడవాళ్ల దుస్తుల్లో వచ్చి దొంగతనాలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నదని ఎస్ఆర్నగర్ పోలీసులు చెబుతున్నారు. ఎస్ఆర్నగర్లో చుడీదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడిన ఘటనను ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆడవాళ్ల వేషధారణతో దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళల దుస్తులు ధరించడం వల్ల దొంగతనం చేయడం ఈజీ అవుతుందని, అపార్టుమెంటులోకి కూడా ఈజీగా ప్రవేశించేందుకు అవకాశం ఉంటుందని, ఎవరికీ అనుమానం రాకుండా కొత్త తరహాలో దొంగతనాలు చేస్తున్నారని, ఈ గ్యాంగును గుర్తించి పట్టుకునేందుకు నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

