చిన్నారిని చంపిందెవరు ?

- గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తింపు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బండ్లగూడ, మే 6: రాజేంద్రనగర్ పరిధిలో ఓ చిన్నారి హత్య ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఆడుకుంటున్న ఆ చిన్నారి క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారింది. తల్లి వచ్చి చూసే సరికి కన్నుమూసింది. ఆ మూడేండ్ల చిన్నారిని గొంతు నులిమి హత్య చేశారని వైద్యులు నిర్ధారించడం కలకలం రేపుతున్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే శ్రీనివాస్, సాయిలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ ఉబర్ బైక్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇదిలా ఉంటే గురువారం ఉదయం సాయిలత తన కూతురి (3)ని ఇంట్లో పడుకోబెట్టి బట్టలు ఆరవేసేందుకు ఇంటిపైకి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత చిన్నారిని పరిశీలించగా ఊపిరి ఆడటం లేదని గుర్తించి వెంటనే నిలోఫర్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం గొంతు నులిమి చంపినట్లుగా ఉందని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Child Murder
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

