వాహన తనిఖీల్లో.. గొలుసు దొంగలు అరెస్ట్

కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 26 : ఒంటరిగా ఉన్న వ్యక్తిని చితకబాది బంగారు గొలుసును తస్కరించి పారిపోయిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, కేపీహెచ్‌బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం ఉదయం కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్‌లో వాహనాలను తనిఖీలు చేస్తుండగా వాహన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో.. ఈనెల 20న కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ సమీపంలోని కళామందిర్ వెనుకాల ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన కోసం ఒంటరిగా వెళ్లిన సంతోష్ నాయక్‌పై దాడిచేసి గొలుసును దొంగిలించినట్లు తేలింది. సంతోష్ నాయక్‌పై దాడిచేసి గొలుసును దొంగిలించిన వారిలో ఎల్లమ్మబండకు చెందిన గురుగోవింద్ సింగ్ (21), సూరారం సాయిబానగర్ చౌరస్తాకు చెందిన నవీన్‌కుమార్ (21), కూకట్పల్లి జయానగర్‌కు చెందిన పులి రాంబాబు (22), కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన టేకు నవీన్ (21) ఉన్నట్లు తేల్చారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన 12 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- chain thief arrested
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

