హైదరాబాద్లోని బండ్లగూడలో దారుణం జరిగింది. ఆస్పత్రిలోనే నిండు గర్భిణీపై సొంత అన్నదమ్ములు దాడి చేశారు. పొట్టపై దాడి చేసి గాయపరిచారు. అడ్డుకున్న ఆమె భర్తపై కూడా కత్తితో దాడి చేశారు.
ఆస్పత్రిలోనే తొమ్మిది నెలల గర్భిణీపై తోబుట్టువులు దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాగా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకే తనపై దాడి చేశారని బాధితురాలు తెలిపింది. తన కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.