రోడ్డేస్తే చూస్తూ ఊరుకోం.. సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మిడోస్ కాలనీవాసుల హెచ్చరిక
బిగ్ రోడ్డు పేరుతో ‘బిగ్ దందా’ జరుగుతోందని, అభివృద్ధి ముసుగులో సామాన్యుల ఇండ్లను నేలమట్టం చేసి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రలు జరుపుతున్నారంటూ సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మిడోస్ కాలనీల ప్రజలు సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- ఎంతవరకైనా పోరాడతామని స్పష్టీకరణ
- రాయలసీమ బిల్డర్ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్
- హెచ్ఎండీఏ శాఖ దాసోహంపై నిప్పులు
- చర్చనీయాంశంగా ‘బిగ్ భూ దందా’ కథనాలు
మణికొండ, అక్టోబర్ 30 : బిగ్ రోడ్డు పేరుతో ‘బిగ్ దందా’ జరుగుతోందని, అభివృద్ధి ముసుగులో సామాన్యుల ఇండ్లను నేలమట్టం చేసి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రలు జరుపుతున్నారంటూ సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మిడోస్ కాలనీల ప్రజలు సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ కాలనీపై నుంచి 100 అడుగుల రహదారి మాస్టర్ ప్లాన్‌పై బిగ్రోడ్డు బిగ్ దందా పేరిట వరుస కథనాలతో అధికారుల మాయాజాలాన్ని బట్టబయలు చేస్తున్న నమస్తే తెలంగాణ కథనాలు చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్లుగా రాయలసీమకు చెందిన ఓ బిల్డరు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వంలోని కీలక శాఖల అధికారులు, బిగ్బ్రదర్స్తో అంతర్గత ఒప్పందాలను చేసుకుని వారందరినీ కీలుబొమ్మలా వేలకోట్ల రూపాయల విలువైన భూములను కాజేస్తున్నాడంటూ భాధితులు ఆరోపిస్తున్నారు.
గతంలో కిస్మత్పూర్, బండ్లగూడ, గండిపేట, మంచిరేవుల గ్రామాలల్లో వందల కోట్ల రూపాయల విలువైన సర్కార్ భూములను సైతం సదరు బిల్డరు కొల్లగొట్టారంటూ భాధితులు మండిపడ్డారు. అదే తరహాలో నార్సింగిలోని సర్కార్ భూములను అగ్గువ ధరకు అధికారుల లోపాయికారిక ఒప్పందాలతోనే సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం రూ. 26 కోట్లకే వేలంలో దక్కించుకోవడం వెనుక బిగ్‌బ్రదర్స్ హస్తం ఉందంటూ మండిపడ్డారు. ఇంత బహిరంగంగా వందల కోట్ల విలువైన భూములను హెచ్ఎండీఏ అధికారులు సైతం ధారదత్తం చేస్తుండటం వెనుక ఆంతర్యమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్ల అలైన్మెంట్లు, మాస్టర్‌ప్లాన్ మార్పిడి సదరు బిల్డరుకు అనుకూలంగా భూములకు రెట్టింపు ధరలను కల్పించే దిశగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నార్సింగిలోని వెస్ట్రన్ మిడోస్, సెవెన్‌హిల్స్ కాలనీల మీదుగా ప్రతిపాదిం చిన 100 అడుగుల రహదారి వ్యవహారం కూడా ఒకటన్నారు. ఈ బిల్డర్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. వరుసగా రెండు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ప్రత్యేక కథనాలతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఏండ్ల తరబడి కష్టపడి, పైసాపైసా కూడబెట్టి తమ కలల సౌధాలను నిర్మించుకున్నామని, ఇప్పుడు వాటి మీదుగా 100 అడుగుల రహదారి వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని బాధితులు స్పష్టం చేస్తున్నారు. 2013 మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రహదారి అలైన్మెంట్, తదనంతర మార్పులు, సర్వేనంబర్లు 103, 105లో చోటుచేసుకున్న భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస కథనాల నేపథ్యంలో ఇప్పటికే హెచ్ఎండీఏ, రెవెన్యూ, స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించారు. కాగా తమ ఇండ్లను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

