ఇక..సాఫీగా ప్రయాణం

- బాలానగర్ ఫ్లై ఓవర్‌పై రయ్‌న దూసుకుపోతున్న వాహనాలు
- కనిపించని ట్రాఫిక్ జాం
- హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
బాలానగర్, జూలై 7 : బాలానగర్‌లో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ప్రయాణం సాపీగా సాగుతున్నది. వాహనాలు రయ్ రయ్‌న దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బాలానగర్‌లో ట్రాఫిక్ చూడాలనుకున్నా…. . మచ్చుకైనా కనిపించడం లేదు. ఐటీ పురపాలకశాఖ మంత్రి ఆధ్వర్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో ైప్లెఓవర్ మంగళవారం సాయం త్రం నుంచి అందుబాటులోకి వచ్చింది. గతంలో బాలానగర్‌లో ప్రయాణం అంటే నరకం అన్న ప్రయాణికులే నేడు సులభం అంటున్నారు. ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమైన వాహనదారులకు ఇప్పుడు ఎంతో ఊరట లభించిందని చెప్పక తప్పదు. పారిశ్రామికవాడ ప్రజల చిరకాల కోరిక బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం కావడంతో అన్ని వర్గాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో తనవంతు సహకారం అందించినట్లు బాలానగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్రాచార్య పేర్కొన్నారు. ఏదేమైనా బాలానగర్‌లో ఇకపై వాహనాలు రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.
చమురు భారం తగ్గనుంది
బాలానగర్‌లో ఎప్పుడెప్పు డా అని ఎదరు చూస్తున్న ఫ్లై ఓవర్ మంగళవారం అందుబాటులోకి రావడం వల్ల ప్యాసిం జర్ వాహనాలకు ఊరట లభిస్తుంది . గతంలో ప్యాసింజర్ ఆటోలు బాలానగర్ ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉండాల్సి వచ్చేది. ైఫ్లై ఓవర్ వల్ల ఇప్పుడు అలాంటి అవసరం ఉండదు. మోయిన్ ఆటో డ్రైవర్, షాపూర్‌నగర్
ట్రాఫిక్ సమస్య తీరింది
బాలానగర్లోఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం సాఫీగా జరుగుతున్నది. బాలానగర్‌లో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు కొనియాడుతారు. – శ్రీనివాస్, రాజుకాలనీ బాలానగర్
బాలానగర్‌లో రవాణా వ్యవస్థ మెరుగు
బాలానగర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందునే ైఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యపడిందని ప్రజలు విశ్వశిస్తున్నారు. బాలానగర్‌లో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలను దూరం చేయడం కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చూపిన ప్రత్యేక చొరవ వెలకట్టలేనిది. ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి.
-రవీందర్‌రెడ్డి, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్
ట్రాఫిక్ పరేషాన్ తప్పింది
బాలానగర్ ప్రధాన రహదారిలో ఎన్నో ఏండ్లుగా ఉన్న ట్రాఫిక్ పరేషాన్ తప్పింది. ఇకపై సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. మంగళవారం సాయం త్రం నుంచి వాహనాల రాకపోకలు విరివిగా జరుగుతున్నాయి. ఒక్క వాహనం కూడా రోడ్డుపై కనిపించకుండా స్పీడ్‌గా దూసుకుపోతున్నాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నా.-పండాల సతీశ్‌గౌడ్, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్
పనితీరుకు నిదర్శనం
బాలానగర్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఎన్నో ఏండ్లు ఎందరో నేతలు ఇక్కడ ప్రాతినిథ్యం వహించారు. అయినా ఎవరూ కూడా బాలానగర్ ట్రాఫిక్ ఇబ్బందులను పట్టించుకోలేదు. గతంలో ఎవరూ చేయని పనిని చేసి ఎమ్మెల్యే కృష్ణారావు అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. -నరేంద్రాచార్య, బాలానగర్ మాజీ కార్పొరేటర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- balanagar flyover
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

