హైదరాబాద్ : పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే లైఫ్ ఇన్సూరెన్స్, ఇతర పాలసీలను చేయించేందుకు గానూ కమిషన్ ప్రతిపాదికన పోస్టల్ ఏజెంట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ శాఖ హైదరాబాద్ సౌత్ డివిజన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆగస్టు 12, 13 తేదీల్లో చేపట్టనున్నారు. ఇతర వివరాల కోసం 040 – 23463800 నంబర్‌కు కాల్ చేయొచ్చు.