Record | అతిపిన్న చదరంగం శిక్షకురాలిగా అల్లు అర్హ రికార్డు

మియాపూర్ : చెస్ బోర్డు అంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే ఆ చిన్నారి ఏకంగా శిక్షకురాలైంది. కేవలం తను ఆడటం వరకే కాకుండా పది మందికి చెస్ క్రీడలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగింది.
ఏకసంతాగ్రాహిగా పట్టువదలని విక్రమార్కురాలిగా అత్యంత తక్కువ వ్యవధిలో చదరంగం నేర్చుకోవటంతోనే ఆగకుండా తన వయసు కంటే పెద్ద వాళ్లకు ఆ క్రీడలో శిక్షణను అందిస్తూ ఔరా అనిపించుకున్నది. ఆ చిన్నారి క్రీడా, శిక్షణా నైపు ణ్యాన్ని గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ‘వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్’ అవార్డును అందించింది.
ఈ ఘనత సాధించిందెవరో కాదు తెలుగు చలన చిత్ర ప్రముఖ కథానాయ కుడు అల్లు అర్జున్ స్నేహరెడ్డిల ముద్దుల కూతురు అల్లు అర్హ. నాలుగున్నరేండ్లకే చెస్లో చిచ్చర పిడుగులా దూసుకు పోతూ..తన క్రీడా నైపుణ్యాన్ని పదిమందికి శిక్షకురాలిగా పంచుతున్నందుకు గాను ప్రఖ్యాత నోబుల్ అవార్డు అల్లు అర్హను వరించింది.

పది క్లాసుల్లోనే పట్టు బిగించిన అల్లు అర్హ….
చదరంగ క్రీడలో నైపుణ్యం చాటి బుల్లి శిక్షకురాలిగా అవార్డు అందుకున్న అల్లు అర్హ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. శేరిలింగంపల్లి నియోజవర్గ పరిధిలోని హైటెక్ సిటీకి చెందిన ‘రాయ్ చెస్ అకాడమీ’లో అల్లు అర్హ చదరంగ క్రీడలో శిక్షణ తీసుకుంది.
తొలుత కథానాయకుడు అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహరెడ్డిలకు సంస్థకు చెందిన రాజశేఖర్రెడ్డి , మాశెట్టి దివ్యశ్రీలు చదరంగ క్రీడలో గడచిన జూన్ మాసంలో ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. తల్లిదండ్రులతో పాటు సదరాగా శిక్షణ సమయంలో అల్లు అర్హ సైతం వారితో కూర్చునేది.
అలా కేవలం వారం రోజుల్లోనే పూర్వానుభవం లేకున్నా…చదరంగంపై పట్టు సాధించింది. తమ చిన్నారి ఆసక్తిని గుర్తించిన అర్హకు ఆ టైనర్ల ద్వారా ప్రత్యేక శిక్షణను ఇప్పించారు.వారంతాల్లో మొత్తం 30 క్లాసులలో రాజశేఖర్రెడ్డి, దివ్యశ్రీలు చదరంగంలో అల్లు అర్హకు శిక్షణను ఇవ్వగా….కేవలం 10 క్లాసులలోనే ఆటపై పట్టు బిగించింది.

తదుపరి తను క్రీడలో నేర్చుకున్న అంశాలను వివరించటంతో పాటు తన తోటి స్నేహితులకు, ఇంట్లో పని చేసే వారికి అర్హ చదరంగంలో శిక్షణ ఇచ్చింది. చిన్నారిలో ఉన్న ప్రతిభను గుర్తించిన శిక్షకులు తమ రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యం లో కొనసాగిస్తున్న ఆఫ్లైన్ , ఆన్లైన్ చదరంగం క్లాసులలో చిన్నారి అల్లు అర్హతో శిక్షణ ఇప్పించటం ప్రారంభించారు.
ఎంతో నైపుణ్యంతో చిన్న పెద్దలకు అర్థమయ్యే రీతిలో అర్హ బోధిస్తుండటంతో అందరిలోనూ క్రీడపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఇలా గడచిన రెండు నెలలుగా అల్లు అర్హ సుమారు 50 మందికి పైగా చదరంగం క్రీడలో శిక్షణను అందించింది. చిన్నారి ప్రతిభను శిక్షకుల ద్వారా తెలుసుకున్న ప్రఖ్యాత ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ సంస్థ ప్రతినిధి , ఆర్బిటర్ చొక్కలింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హ నైపుణ్య పరీక్షను శుక్రవారం చేపట్టారు.

క్రీడలో చిన్నారి ప్రతిభతో పాటు శిక్షణను అందించే సామర్థ్యాన్ని గుర్తించి ఆ చిన్నారికి ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ’ అవార్డును అందించింది. ఈ అవార్డును శుక్రవారం కుటుంబ సభ్యులు , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మల, అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు సహా వారి కుటుంబ సభ్యుల నడుమ ఆర్బిటర్ బాలాజీ చిన్నారికి బహుకరించారు.
ఈ సందర్భంగా చిన్నారికి చదరంగంలో శిక్షణ అందించిన రాయ్స్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు రాజశేఖర్రెడ్డి, ప్రతినిధి దివశ్రీలు మాట్లాడుతూ తమ సంస్థలో శిక్షణ పొందిన అల్లు అర్హ ప్రఖ్యాత అవార్డుకు ఎంపిక కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
క్రీడలో నేర్పే మెళకువలను అర్హ ఎంతో శ్రద్ధగా నేర్చుకోవటమే కాకుండా తిరిగి చెప్పటంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించే దని వారు పేర్కొన్నారు. అల్లు కుటుంబ సభ్యులు సైతం శిక్షకులను ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

