Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Hyderabad | హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్ నంబర్ 131 సమీపంలో ఆరంఘర్ వైపు వెళ్లే మార్గంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక నుంచి వస్తున్న మరో ఐదు కార్లు వరుసగా ఢీకొన్నాయి
Hyderabad | హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్ నంబర్ 131 సమీపంలో ఆరంఘర్ వైపు వెళ్లే మార్గంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక నుంచి వస్తున్న మరో ఐదు కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనతో ఎక్స్‌ప్రెస్‌వేపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనదారులు ముందున్న కారును గమనించి బ్రేకులు వేసేలోపే ఒకదాని వెనుక ఒకటి ఐదు కార్లు ఢీకొన్నాయి. దీంతో మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఢీకొన్న ధాటికి వాహనాల ముందు, వెనుక భాగాలు దెబ్బతిన్నాయి.
#HYDTPinfo
#AccidentAlert🚨
An accident has been reported near Pillar No. 131 on PVNR Expressway towards Aramghar. our mobile staff of @shotr_rjnr have reached the spot to clear the vehicles.Commuters are requested to proceed with caution and follow traffic personnel instructions.
#HyderabadTraffic— Hyderabad Traffic Police (@HYDTP) October 15, 2026
ప్రమాదంపై సమాచారం అందుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మొబైల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి నుంచి పక్కకు తొలగించే చర్యలు చేపట్టి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
ఈ ఘటనలో వాహనాల్లో ప్రయాణిస్తున్నవారి పరిస్థితిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటించాలని పోలీసులు కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

