PMC | పీఎంసీ ఛానల్ ఈడీ నవకాంత్ బెయిల్ రద్దు చేయాలి : లైంగికదాడి బాధితురాలు
PMC | పీఎంసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ బెయిల్ రద్దు చేయాలని లైంగిక దాడికి గురైన బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి తెలిపింది.
PMC | ఖైరతాబాద్, ఫిబ్రవరి 28 : పీఎంసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ బెయిల్ రద్దు చేయాలని లైంగిక దాడికి గురైన బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి తెలిపింది.
2021 జనవరి 1న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో పీఎస్ఎస్ఎమ్ మీడియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎంసీ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో రిసెప్షనిస్టుగా విధుల్లో చేరాను. కొద్ది రోజుల తర్వాత ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్తో కలిసి పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఆ అంశాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్లేదాన్ని. 2022 అక్టోబర్ 8న నవకాంత్ ఓ కారులో ఒక ఇంటర్వ్యూ కోసం బేగంపేటలోని రాఘవేంద్ర గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ చేయాల్సిన వ్యక్తి వస్తాడని సమయం పడుతుందని అక్కడే కూర్చోబెట్టాడు. సాయంత్రం 6 గంటల సమయంలో తాను వేచి ఉన్న గదికి వచ్చిన నవకాంత్ బలవంతంగా కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడ్డు. సాయంత్రం 7 గంటల సమయంలో మంచినీరు అందించి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. అతని మాటలు నమ్మి తాను ఎవరికీ విషయాన్ని చెప్పలేదని బాధితురాలు వాపోయారు.
ఆ తర్వాత తరచూ తనను ఆఫీసు నుంచి ఇంటివద్ద కారులో డ్రాప్ చేస్తుండే వాడని, ఆదివారాలు సైతం ఆఫీసుకు రమ్మనేవాడని, ఆ సందర్భంలో సిబ్బంది ఎవరూ లేని సమయంలో ఆరుసార్లు తనతో కామ వాంఛ తీర్చుకున్నాడు. రోజులు గడిచినా పెళ్లి ప్రస్తావన రాకపోవడంతో అతన్ని నిలదీశాను. దీంతో గత ఏడాది జూన్ 10న ఆఫీసులో పనిచేసే నటరాజ్ అనే వ్యక్తితో కలిసి తనను కారులో కేబీఆర్ పార్క్‌కు తీసుకెళ్లాడు. అక్కడ నుంచి నటరాజ్ అనే వ్యక్తి ని పంపించేసి తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. ఎందుకు చేసుకోరని నిలదీయడంతో తీవ్రంగా కొట్టాడు. కొద్ది రోజులకు నవకాంత్‌కు అప్పటికే వివాహం జరిగినట్లు తన దృష్టికి వచ్చింది. దీంతో పిఎంసి కార్యాలయంలోనే అందరి ముందు నిలదీశానని, అక్కడే ఉన్న చానల్ యాంకర్ ప్రొడ్యూసర్, అతని స్నేహితురాలైన మిట్టపల్లి రజిత పోలీసులు, మీడియాకు చెబితే తనపై లైంగిక దాడి జరిపినప్పటి వీడియోలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని వాటిని బయట పెడతామంటూ బెదిరించారు. వారి బెదిరింపులకు వెరవకుండా గత ఏడాది డిసెంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై 376, 341, 506, 323 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద (ఎఫ్ఐఆర్ నెం. 1154/2024) కేసులు నమోదు చేశారని బాధితురాలు తెలిపారు.
ఇప్పటి వరకు పోలీసులు అతనిపై సరైన చర్యలు తీసుకోలేదు. నిందితుడు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నాడు. ఇప్పటికే కమిషనర్, డీసీపీలను కలిశానని, కానీ సరైన స్పందన లేదు. కనీసం తనపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెబుతున్న అతని ఫోను సైతం సీజ్ చేయలేదు. ఆధ్యాత్మికత పేరుతో ఏర్పాటు చేసిన ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓ ఆడపిల్లపై అఘాయిత్యం చేస్తే పట్టించుకునే వారే లేరు. తక్షణమే నవకాంత్ బెయిల్ రద్దు చేయాలని, అతనికి వంత పాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి స్పందించి ఈ కేసు పై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

