కొండాపూర్, అక్టోబర్ 24 : చందానగర్లో చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఇన్స్పెక్టర్ పాలవెల్లి కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్లో భాగంగా మంగళవారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గంగారం కూడలిలో వాహనాల తనిఖీ చేపట్టారు.
డి. రవికుమార్ రూ. 28,09,519 నగదుతో వెళ్తున్నాడు. సరైన పత్రాలు చూపకపోవడంతో అతడి వద్ద నుంచి నగదును సీజ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేసినట్లు తెలిపారు.