22A Victim | నువ్వు మంత్రిగా ఉండి ఏం లాభం.. పొంగులేటి రాజీనామా చేసి వెళ్లిపో : 22A బాధితుడు
22A Victim ప్లీజ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ మీ పని మీరు చేయండి.. మీ అధికారులు పనిచేయడం లేదు. మా కాలనీ వ్యక్తులు మీ అధికారి దగ్గరకు పోయి పనిచేయండని అడుగుతారా..? పనిచేయాలని మేం అడగాలా..? అని వసంత్ నగర్ డివిజన్లో 22A బాధితుడొకరు ప్రశ్నించారు.
22A Victim | కాంగ్రెస్ సర్కార్ 22A సెక్షన్ పేరుతో భయాందోళలకు గురి చేస్తుందని బాధితులు వాపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని వసంత్ నగర్ డివిజన్లో 22A బాధితుడొకరు మీడియాతో మాట్లాడుతూ.. 22ఏ సెక్షన్ అనేది అనాలోచితమైన నిర్ణయం. అంతుకుముందున్న నిజాం ప్రభువే నీకు భూములను అప్పగించాడు. ఆ భూమి ప్రజలకు వచ్చింది. ప్రజలకు వచ్చింది నువ్వు తీసుకునేందుకు నువ్వు నిజాంకన్నా గ్రేటా..? అని ప్రశ్నించారు. అసలు చేసేటప్పుడు నీ డిపార్ట్మెంట్లో నీకు తెలియకపోతే నువ్వు మినిస్టర్‌గా ఎందుకున్నావ్..? మేం క్షమాపణలు కోరడానికి మినిస్టర్‌ను ఎన్నుకోలేదు.. ప్రజల సమస్యలను అడిగేందుకు, ప్రజల సంక్షేమం కోసం ఎన్నుకున్నమని అన్నారు.
ప్లీజ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ మీ పని మీరు చేయండి.. మీ అధికారులు పనిచేయడం లేదు. మా కాలనీ వ్యక్తులు మీ అధికారి దగ్గరకు పోయి పనిచేయండని అడుగుతారా..? పనిచేయాలని మేం అడగాలా..? వచ్చిన ఆర్డర్‌ను ఫాలో చేయి.. సుప్రీంకోర్డు ఆర్డర్ కానీ..హైకోర్టు ఆర్డర్ కానీ ఫాలో చేయ్.. లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎన్నో ఆర్డర్లు వస్తాయి.. దయచేసి వాటిని ఫాలో అవ్వండని విజ్ఞప్తి చేశాడు. ప్రజాప్రభుత్వం అంటూ ఆస్తులు కాపాడటం కాదు.. ఆస్తులను బ్లాక్ చేస్తున్నారు. నువ్వు చేయాల్సింది క్షమాపణ చెప్పడం కాదు.. నువ్వు రాజీనామా చేసి వేరొకరికి అప్పగించు. మాకు క్షమాపణలు చెప్పడం కాదు.. పొంగులేటి రాజీనామా చేసి వెళ్లిపోవడం ఉత్తమ మార్గమని హితవు పలికాడు. నేను ఈ ఆఫీసర్‌తో చేయిస్తా.. చేయించా నాదగ్గర ఆధారాలున్నయి.. నువ్వెందుకు చేయించలేవు.. నువ్వు క్షమాపణ చెప్తావని నిన్ను మంత్రిగా ఎన్నుకోలేదు పొంగులేటి
1/3 భూమి 22A కిందకి పోతే నువ్వు మంత్రిగా ఉండి ఏం లాభమని పొంగులేటిని ప్రశ్నించాడు. పొంగులేటి నేను సరిచేస్తాను అంటున్నాడు.. నువ్వే పుల్ల పెట్టి నువ్వే సరిచేయటం ఏంటయ్యా బాబు అని ఎద్దేవా చేశారు. నువ్వు పిల్లవాడిలా మాట్లాడుతున్నావ్.. మెచ్యూర్డ్‌గా మాట్లాడలేదు. అందుకే నువ్వు మినిస్టర్‌గా మాకు అవసరం లేదు. నువ్వు తప్పు చేసింది నీకు తెలియదా..? అదే హరీష్ రావుతోపాటుమన ప్రజాప్రతినిధులు అన్నారని ఫైర్ అయ్యాడు.
నువ్వు క్షమాపణ చెప్తావని నిన్ను మంత్రిగా ఎన్నుకోలేదు పొంగులేటి
1/3 భూమి 22A కిందకి పోతే నువ్వు మంత్రిగా ఉండి ఏం లాభం
క్షమాపణ కాదు పొంగులేటి నువ్వు చెప్పాల్సింది.. రాజీనామా చేసి వేరే వాళ్లకి ఇచ్చే
నేను సరిచేస్తాను అంటున్నాడు.. నువ్వే పుల్ల పెట్టి నువ్వే సరిచేయటం ఏంటయ్యా బాబు
-… https://t.co/mMgNvIZAfv pic.twitter.com/EVyX4MyEQp
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

