Hormonal Problems | హార్మోన్ల సమస్యలు ఉన్న మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!
నేటి తరుణంలో హార్మోన్ల అసమతుల్యతతో బాధపడే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారిన జీవన విధానం,ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఎదుర్కొంటున్న చాలా మంది మహిళలు నేరుగా సప్లిమెంట్స్ లేదా హార్మోన్ బ్యాలెన్సింగ్ ఉత్పత్తులవైపు వెళ్లిపోతుంటారు.
Hormonal Problems | నేటి తరుణంలో హార్మోన్ల అసమతుల్యతతో బాధపడే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారిన జీవన విధానం,ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఎదుర్కొంటున్న చాలా మంది మహిళలు నేరుగా సప్లిమెంట్స్ లేదా హార్మోన్ బ్యాలెన్సింగ్ ఉత్పత్తులవైపు వెళ్లిపోతుంటారు. శరీరం ముందుగా సిద్ధంగా లేకపోతే అలాంటి ప్రయత్నాలు ప్రయోజనం ఇవ్వకపోగా సమస్యలను మరింత పెంచే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ అధిక స్థాయిలకు సంబంధించిన లక్షణాలను తగ్గించాలంటే ముందుగా కాలేయం (లివర్) పనితీరును మెరుగుపరచడం చాలా అవసరమని వారు సూచిస్తున్నారు. శరీరంలో ఈస్ట్రోజెన్‌ను ప్రాసెస్ చేసి బయటకు పంపే ప్రధాన బాధ్యత లివర్‌దే. మొదట లివర్ ఈస్ట్రోజెన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. తరువాత దానిని శరీరం నుంచి బయటకు వెళ్లేలా ప్యాక్ చేస్తుంది. ఈ ప్రక్రియ మందగిస్తే ఈస్ట్రోజెన్ పూర్తిగా బయటకు వెళ్లకుండా మళ్లీ శరీరంలోనే తిరుగుతుందని, దీనినే ఈస్ట్రోజెన్ డామినెన్స్ అంటారని నిపుణులు వివరిస్తున్నారు.
ఫైబర్ సమృద్ధిగా అవసరం..
ఈ పరిస్థితిని సరిచేయడానికి ముందుగా గట్ హెల్త్‌పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. రోజుకు 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరచవచ్చని చెబుతున్నారు. ఇందుకు అరటి పండ్లు, మునగ ఆకులు, మెంతులు, అవిసె గింజలు వంటి ఆహారాలు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. అయితే శరీరం ఎంతవరకు ఫైబర్‌ను తట్టుకోగలదో దాన్ని బట్టి మోతాదును నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పెరుగు, కాంజీ, ఇంట్లో తయారుచేసిన పచ్చళ్ళ వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. గట్ ఆరోగ్యం మెరుగైన తర్వాత లివర్‌కు అవసరమైన పోషకాలను అందించడం ముఖ్యం. గుడ్లు, షిటాకే మష్రూమ్స్‌లో ఉండే కొలిన్ లివర్ పనితీరుకు సహాయపడుతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు మద్దతిస్తాయి. ఆకుకూరలు, ఉడికించిన పప్పుల్లో ఉండే సహజ ఫోలేట్ కూడా ఉపయోగకరమని పేర్కొంటున్నారు. సన్‌ఫ్లవర్ గింజల్లో ఉండే విటమిన్ బి6 కూడా హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుందని చెబుతున్నారు.
ఈస్ట్రోజెన్ ను మళ్లీ శోషించకూడదు..
అంతేకాకుండా శరీరంలో ఈస్ట్రోజెన్ మళ్లీ శోషించబడకుండా అడ్డుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. నారింజ, యాపిల్ వంటి పండ్లలో ఉండే గ్లూకారిక్ యాసిడ్ ఈ ప్రక్రియలో సహాయపడుతుందని వెల్లడిస్తున్నారు. ఇది గట్‌లో ఉండే కొన్ని ఎంజైమ్స్‌ను అడ్డుకొని ఈస్ట్రోజెన్ మళ్లీ శరీరంలోకి వెళ్లకుండా సహాయపడుతుందని వివరిస్తున్నారు. ఇక ఈ అన్ని దశలను పాటించిన తరువాతే DIM సప్లిమెంట్స్ గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు. DIM అనేది బ్రోకోలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో ఉండే సంయోగం నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థం. ఇది ఈస్ట్రోజెన్‌ను సురక్షిత మార్గంలో విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అయితే గట్, లివర్, ఎలిమినేషన్ వ్యవస్థ సరిగా పనిచేయకముందే DIM తీసుకుంటే శరీరంలో ఇప్పటికే ఉన్న బ్లాకేజ్ మరింత పెరిగి లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
DIM సప్లిమెంట్స్‌ను ఇలా తీసుకోవాలి..
అలాగే అవసరమైతే రోజుకు 1000 మిల్లీగ్రాముల DIMను కొవ్వు ఉన్న ఆహారంతో తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే అది కూడా శరీరం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పటికీ సమస్యలు కొనసాగితే హార్మోన్ మెటబాలిజం ఏ దశలో ఇబ్బంది పడుతోందో తెలుసుకోవడానికి ప్రత్యేక పరీక్షలు చేయించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మందికి ఆ దశ అవసరం ఉండదని, ముందుగా గట్, లివర్ ఆరోగ్యం మెరుగుపడితేనే ఈస్ట్రోజెన్ సంబంధిత సమస్యల్లో మంచి మార్పు కనిపిస్తుందని వివరిస్తున్నారు. మలబద్ధకం ఉన్నవారిలో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం నుంచి వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లకపోతే హార్మోన్ అసమతుల్యత ఎక్కువ కాలం కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

