Apps:
Follow us on:

Lemon Pickle | నిమ్మకాయ తొక్కు ఆరోగ్యానికి మంచిదేనా?

1/6మ‌న తెలుగు వంట‌కాల్లో తొక్కుల‌ది ప్రత్యేక స్థానం. ఏ కూరతో భోజ‌నం చేసినా మొద‌టి ముద్ద తొక్కుల‌తో ఉండాల్సిందే. ఈ తొక్కుల్లో ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ముఖ్యంగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే నిమ్మకాయ తొక్కుతో ఆరోగ్యానికి ఎంతో మంచిది.
2/6ఆరోగ్యంగా ఉండాలంటే శ‌రీరంలో ర‌క్తప్రస‌ర‌ణ స‌క్రమంగా ఉండాలి. ర‌క్త ప్రవాహంలో హెచ్చు త‌గ్గులు ర‌క్తపోటుకు కార‌ణ‌మ‌వుతాయి. అయితే రోజూ నిమ్మకాయ తొక్కుతో తిన‌డం వ‌ల్ల ర‌క్త ప్రస‌ర‌ణ మెరుగ‌వు‌తుంది.
3/6నిమ్మకాయ తొక్కులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పైగా కొవ్వు అస‌లు ఉండ‌దు. హృద్రోగాలు వ‌చ్చే ప్రమాదం త‌క్కువ ఉంటుంది. కాబ‌ట్టి దీన్ని నిర‌భ్యంతరంగా డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.
4/6నిమ్మకాయ‌లో కాప‌ర్‌, పొటాషియం, ఐర‌న్‌, కాల్షియం ఉంటాయి. వ‌య‌సు పెరిగే కొద్ది ఎముక‌ల ఆరోగ్యం క్షీణించ‌డం మొద‌ల‌వుతుంది. కాబ‌ట్టి కాల్షియం, విట‌మిన్ ఏ, సీ, పొటాషియం క‌లిగిన నిమ్మకాయ తొక్కును ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా ఎముక‌ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌చ్చు.
5/6స‌ప్లిమెంట్ల ద్వారా విట‌మిన్లు, పోష‌కాల‌ను తీసుకోవ‌డానికి బ‌దులు ఆరోగ్యక‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం ద్వారా వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌చ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మకాయ తొక్కు ఒక‌టి. ఇందులో బీ కాంప్లెక్స్ విట‌మిన్లు పుష్కలంగా ఉంటాయి.
6/6నిమ్మకాయ తొక్కు తిన‌డం వ‌ల్ల జీర్ణక్రియ స‌క్రమంగా జ‌రుగుతుంది. నిమ్మలో ఉండే ఎంజైములు శ‌రీరంలోని విష‌తుల్యాల‌ను తొల‌గించడంలో స‌హ‌క‌రిస్తాయి. దీనివ‌ల్ల బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.