Watermelon Rind | పుచ్చకాయలను తిన్నాక వాటికి ఉండే తెల్లని తొక్కను పడేస్తున్నారా.. అయితే అలా చేయకండి.. ఎందుకంటే..
వేసవికాలంలో తరచూ తినే పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దాని తియ్యని, రసభరితమైన ఎరుపు భాగం మాత్రమే ఎక్కువగా తింటూ, బయట ఉండే తెల్లటి పొరతో కూడిన పచ్చని తొక్కను మాత్రం వృథాగా పారేస్తుంటారు. అయితే పోషకాహార నిపుణులు చాలా మంది పారేసే ఆ భాగమే అసలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరమని చెబుతున్నారు.
Watermelon Rind | వేసవికాలంలో తరచూ తినే పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దాని తియ్యని, రసభరితమైన ఎరుపు భాగం మాత్రమే ఎక్కువగా తింటూ, బయట ఉండే తెల్లటి పొరతో కూడిన పచ్చని తొక్కను మాత్రం వృథాగా పారేస్తుంటారు. అయితే పోషకాహార నిపుణులు చాలా మంది పారేసే ఆ భాగమే అసలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరమని చెబుతున్నారు. పుచ్చకాయలోని తెల్లటి తొక్క భాగం (watermelon rind)లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ తెల్లటి భాగంలో ఉండే పోషకాలు, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి నిపుణులు వివరిస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి..
పుచ్చకాయలోని తెల్లటి తొక్క భాగంలో ఉండే ఎల్-సిట్రులిన్ (L-Citrulline) అనే అమినో ఆమ్లం శరీరంలో ఆర్జినిన్గా మారి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ ప్రక్రియ రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ తెల్లటి తొక్కలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6, రైబోఫ్లేవిన్, విటమిన్ ఎ, ప్రీకర్సర్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీర మెటబాలిజాన్ని సపోర్ట్ చేస్తాయి. అలాగే శరీరంలోని రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
అనేక విధాలుగా తీసుకోవచ్చు..
పుచ్చకాయ తొక్కను ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం. దీనిని స్మూతీల్లో కలపవచ్చు, చట్నీగా తయారు చేసుకోవచ్చు, కూరలలో వేపుడు రూపంలో వాడుకోవచ్చు లేదా పచ్చడి (పికిల్)గా కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సాధారణంగా వృథా చేసే పుచ్చకాయ తొక్కలోనే గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఇకపై పుచ్చకాయ తిన్న తర్వాత ఆ తెల్లటి భాగాన్ని పారేయకుండా, తెలివిగా వాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

