Water On Empty Stomach | ఉదయం నిద్రలేవగానే నీళ్లను తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..!
మన శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో నీరు మనకు సహాయపడుతుంది.
Water On Empty Stomach | మన శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో నీరు మనకు సహాయపడుతుంది. రోజుకు కనీసం 4 నుండి 5 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనలో చాలా మంది ఉదయం నిద్రలేచిన తరువాత టీ, కాఫీ లను తాగుతూ ఉంటారు. వాటికి బదులుగా ఉదయం పూట నీటిని తాగడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. ఉదయం పూట నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. మన శరీర ఆరోగ్యవిషయంలో మనం గణనీయ మార్పులను చూడవచ్చని వారు అంటున్నారు. ఉదయం పూట నీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వారు అంటున్నారు.
జీవక్రియల వేగం..
రాత్రి చాలా సమయం నిద్రించడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. కనుక ఉదయం లేవగానే నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం పెరుగుతుంది. దీంతో శరీర విధులు సక్రమంగా జరుగుతాయి. ఉదయం నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం 30 శాతం వరకు పెరుగుతుంది. జీవక్రియల వేగం పెరగడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు చేయబడతాయి. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. మనం నిద్రించిన తరువాత మన శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో మన శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం నీటిని తాగడం వల్ల ఈ వ్యర్థాలు అన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి. అంతేకాకుండా మూత్రపిండాల పనితీరు కూడా పెరుగుతుంది.
జీర్ణక్రియకు..
ఇక ఉదయం నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగు కదలికలు పెరుగుతాయి. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణాశయం ఆరోగ్యంగా తయారవుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. ఉదయం నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మానికి రక్తప్రసరణ పెరగడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. చర్మానికి కావల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముడతలు, మొటిమలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మెదడు పనితీరుకు నీరు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా మెదడు అభిజ్ఞా పనితీరు తగ్గుతుంది. కనుక ఉదయం లేవగానే నీటిని తాగడం వల్ల ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజంతా సానుకూలంగా ఉంటుంది.
రోగ నిరోధక శక్తికి..
ఉదయం పూట నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీటిని తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు, విషాలు తొలగిపోతాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్పెక్షన్ ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలో డీహైడ్రేషన్ అలసట మానసిక మార్పులకు దారి తీస్తుంది. నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. నీటిని తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. నీరు సహజంగానే ఆకలిని అణచి వేస్తుంది. అతిగా, ఎక్కువగా తినే వారు భోజనానికి ముందు నీటిని తాగడం వల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి కావల్సిన ఆక్సిజన్, పోషకాలు చక్కగా అందుతాయి. ఈ విధంగా ఉదయం పూట నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఉదయం పూట టీ, కాఫీలకు బదులుగా నీటిని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

