Fitness secrets: విహారయాత్రలకు వెళ్తున్నారా? ఫిట్నెస్ను ఇలా కాపాడుకోండి!!
ఒత్తిడిని దూరం చేసుకునేందుకు చాలామంది విహారయాత్రలకు వెళ్తుంటారు. మరి ఈ సమయంలో జిమ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం ఆరోగ్య దినచర్యపై ప్రభావం చూపుతుంది. మరి ఈ సమయంలో ఫిట్‌గా ఉండడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం విహార యాత్రలను వాయిదా వేసుకుంటున్నారా..? అయితే, మీకోసమే నిపుణులు కొన్ని ఫిట్నెస్ సీక్రెట్స్ చెబుతున్నారు. ఇక టెన్షన్స్ పక్కనపెట్టి మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టిపెట్టండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ కొత్త ప్రదేశాలను ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి.
న్యూఢిల్లీ: ఒత్తిడిని దూరం చేసుకునేందుకు చాలామంది విహారయాత్రలకు వెళ్తుంటారు. మరి ఈ సమయంలో జిమ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం ఆరోగ్య దినచర్యపై ప్రభావం చూపుతుంది. మరి ఈ సమయంలో ఫిట్‌గా ఉండడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం విహార యాత్రలను వాయిదా వేసుకుంటున్నారా..? అయితే, మీకోసమే నిపుణులు కొన్ని ఫిట్నెస్ సీక్రెట్స్ చెబుతున్నారు. ఇక టెన్షన్స్ పక్కనపెట్టి మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టిపెట్టండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ కొత్త ప్రదేశాలను ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి.
1. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకండి..
అల్పాహారం మీకు రోజంతా ప్రయాణించే శక్తిని ఇస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు మీకు శక్తి అవసరం. ఆయిల్ ఫుడ్స్ జోలికెళ్లొద్దు. నట్స్, పండ్లలాంటి జీవక్రియను వేగవంతం చేసే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవాలి.
2. హైడ్రేటెడ్ గా ఉండండి..
మీ ప్రయాణాల్లో తగినంత నీటిని తాగుతూ ఉండండి. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వేడి, తేమతో కూడిన ప్రాంతానికి ప్రయాణిస్తున్నట్లయితే ఇది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
3. ప్రోటీన్ బార్లను వెంట తీసుకెళ్లండి..
పర్యటన సమయంలో ఆకలి బాధలను దూరం చేసుకునేందుకు కేలరీల గురించి చింతించకుండా తక్షణ శక్తిని అందించే ప్రోటీన్ బార్లను తీసుకెళ్లండి. ఇవి అంతటా సులభంగా అందుబాటులో ఉంటాయి.
4. లోకల్ జిమ్స్‌లో సమయం గడపండి..
మీకు సాయంత్రం వేళల్లో సమయముంటే హోటల్ లేదా రిసార్ట్ జిమ్‌కు వెళ్లండి. ప్రస్తుత కాలంలో ప్రతి హోటల్ జిమ్‌లలో రోజువారీ వ్యాయామం కోసం ఉపయోగించే చాలా పరికరాలు ఉంటున్నాయి. విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
5. వీలు దొరికినప్పుడల్లా నడవండి..
విహారయాత్రలకు వెళ్లినప్పుడు ట్యాక్సీల్లో ప్రయాణించే బదులు ఆయా ప్రాంతాల చుట్టూ కొద్దిదూరం నడవండి. స్థానిక పార్కులను సందర్శించండి. పదినిమిషాలపాటు స్క్వాట్స్, బర్ఫీస్ చేయండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

