వాసన, రుచి గుర్తించలేకపోతున్నారా..? అయితే ఈ విటమిన్ లోపం కావచ్చు..
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. ఉదయం నీరెండలో నిలబడేంత టైం లేకపోవడం, తగిన పోషకాలున్న ఆహారం తీసుకోకపోవడం వల్ల డీ విటమిన్ లోపం కనిపిస్తున్నది.
మన శరీరంపై సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల చర్మం కింద పొరల్లోని కొవ్వులు కరిగి డీ విటమిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్ లోపం కారణంగా గుండె సంబంధ సమస్యలు, ఎముకలు గుల్లబారిపోవడం, రోగనిరోధక శక్తి సన్నగిల్లడం, కణ విభజన నియంత్రణ కోల్పోవడం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటాం.

అయితే, డీ విటమిన్ తగినంత మోతాదులో కలిగి లేని వారు ఒక వయసు వచ్చాక వాసన, రుచిని కూడా కోల్పోతారు. వయసు కారణంగా బలహీనపడిపోవడం వల్ల ఈ విషయాన్ని త్వరగా గుర్తించలేరు. విటమిన్ డీ లోపం అనేది.. వాసన, రుచి కోల్పోవడం మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి వారు ఎక్కువ వాసనలను గుర్తించలేరు. ఆరు వాసనలను గుర్తించడం వరకే వీరు పరిమితమవుతారని న్యూట్రియంట్స్ జర్నల్లో ప్రచురించిన 2020 నాటి అధ్యయనంలో పేర్కొన్నారు.

ఒక రోజులో తగినంత మొత్తంలో విటమిన్ డీ పొందుతున్న వారితో పోలిస్తే.. ఈ విటమిన్ లోపించిన వారు భవిష్యత్ జీవితంలో రుచి, వాసనను గుర్తించలేని బలహీనతకు గురయ్యే అవకాశం 39 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. సరైన మోతాదులో డీ విటమిన్ లేనప్పుడు మనం తీసుకునే కాల్షియంను శరీరం పీల్చుకోదు. శరీరానికి కాల్షియం అందాలంటే డీ విటమిన్ ఉండాల్సిందే.
ఈ విటమిన్ లేమి వల్ల అలసట, నొప్పులు, ఒంట్లో బాగుండంట్లుగా అనిపించడం, మజిల్ పెయిన్, బోన్ పెయిన్, మెట్లు ఎక్కలేకపోవడం, కింద కూర్చుని లేచేప్పుడు ఇబ్బందిగా అనిపించడం, కాళ్ళు, పెల్విస్, హిప్స్ ప్రాంతం లో స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డీ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి సూర్యరశ్మి చాలా కీలకమైనది. వేసవి కాలంలో నిత్యం 10-20 నిమిషాలపాటు సూర్య కిరణాలను శరీరంపై పడేలా చూసుకోవడం ద్వారా డీ విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. అదే చలికాలంలో రెండు గంటలపాటు సూర్యరశ్మి పడేలా చూసుకోవాలని పరిశోధకులు సెలవిస్తున్నారు.
సూర్యరశ్మి నుంచే కాకుండా డీ విటమిన్ ముఖ్యంగా పాలకూర, కాలే, ఓక్రా, సోయా బీన్స్, బైట్ బీన్స్తోపాటు సార్డైన్, సాల్మన్ వంటి చేపలను తినడం వల్ల పొందవచ్చు. అలాగే, పాలు, కాడ్లివర్ ఆయిల్, గుడ్డు పచ్చ సొన, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ యోగర్ట్లలో కూడా ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

