అదేపనిగా చూస్తే..
డిజిటల్ యుగం మొదలయ్యాక టీవీలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అంటూ స్క్రీన్‌ని చూసే సమయం కూడా పెరిగింది. దీనివల్ల కళ్ల మీద దుష్ప్రభావం పడుతుందన్న విషయం చర్చలోకి తరచూ వస్తున్నదే. అయితే ఈ స్క్రీన్ టైమ్ పెరగడం కారణంగా రక్తపోటు కూడా పెరుగుతున్నదని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.
డిజిటల్ యుగం మొదలయ్యాక టీవీలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అంటూ స్క్రీన్‌ని చూసే సమయం కూడా పెరిగింది. దీనివల్ల కళ్ల మీద దుష్ప్రభావం పడుతుందన్న విషయం చర్చలోకి తరచూ వస్తున్నదే. అయితే ఈ స్క్రీన్ టైమ్ పెరగడం కారణంగా రక్తపోటు కూడా పెరుగుతున్నదని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా పరిశోధనల ప్రకారం సగటున 6 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నవారిలో అంత కన్నా తక్కువగా స్క్రీన్ టైమ్ ఉండే వారితో పోల్చితే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది.
35 ఏండ్లు పైబడిన 382 మందిపై చేసిన పరిశోధనలో స్క్రీన్ టైమ్‌కి రక్తపోటుకు మధ్య ఉన్న ఈ సంబంధం తేటతెల్లమైంది. మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు, నిద్ర, వ్యాయామం తదితర అంశాలు, రోజువారి జీవనశైలిని పరిగణనలోకి తీసుకొని పరిశోధన చేశారు. ఎక్కువ స్క్రీన్ టైమ్ వినియోగం… బీపీతోనే ఆగిపోకుండా రక్తంలో అధిక కొలెస్ట్రాల్ చేరడం, బాడీ మాస్ ఇండెక్స్ పెరగడం, నడుము చుట్టుకొలతలో మార్పులు తదితర సమస్యలకు దారి తీస్తుందని వెల్లడైంది.
ఇవన్నీ నేరుగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండేవారు నడక, జాగింగ్ లాంటి వ్యాయామ అంశాల మీద కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. అయితే స్కూల్లో, ఆఫీసుల్లో ఉపయోగించే స్క్రీన్ టైమ్‌ని ఈ పరిశోధనలో పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తానికి ఆరోగ్యాన్ని దెబ్బతీసే జీవనశైలి అలవాట్లలో ఇప్పుడు స్క్రీన్ టైమ్ కూడా చేరిందని పరిశోధన తేల్చి చెబుతున్నది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Digital Age
- laptops
- phones
- tvs
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

