ఈ లక్షణాలుంటే గ్లకోమా కావొచ్చు.. కంటిచూపు పోవచ్చు..!!
గ్లకోమానే నీటికాసులు అని కూడా పిలుసుస్తారు. ఇది ఒకరకమైన కంటివ్యాధి. ఇది చాపకిందనీరులా మనకు తెలియకుండానే కంటిచూపును హరించేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2022 మార్చి 6 నుంచి 12 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
గ్లకోమానే నీటికాసులు అని కూడా పిలుసుస్తారు. ఇది ఒకరకమైన కంటివ్యాధి. ఇది చాపకిందనీరులా మనకు తెలియకుండానే కంటిచూపును హరించేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2022 మార్చి 6 నుంచి 12 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
గ్లకోమా వల్ల కళ్లలోని ఆప్టిక్ నరాల దెబ్బతింటాయి. కంటి లోపల అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. వృద్ధుల్లో (60 ఏళ్లు పైబడిన) అంధత్వానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి. గ్లకోమా అనేక రకాలు. ఇందులో అత్యంత సాధారణ రూపం ప్రాథమిక ఓపెన్-యాంగిల్ గ్లకోమా. ఇది క్రమంగా దృష్టి కోల్పోవడం మినహా ఎలాంటి సంకేతాలు లేదా లక్షణాలను కలిగి ఉండదు. గ్లకోమాకు చికిత్స లేదు. దానిని నివారించడం సాధ్యం కాదు, అయినప్పటికీ, సకాలంలో చికిత్సను ప్రారంభించేందుకు, అది తీవ్రతరం కాకుండా నిరోధించేందుకు ముందుగానే గుర్తించడం ఉత్తమ పద్ధతి.
గ్లకోమా సంకేతాలు..
1.కళ్లు ఎరుపెక్కడం..
ఇది చాలా సాధారణమైన సంకేతం. ఇది వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. అయితే, నిరంతరం కళ్లు ఎరుపుగా మారుతుంటే నిర్లక్ష్యం చేయొద్దు. అది గ్లకోమాకు సంకేతం కావొచ్చు. వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
2.హాలో విజన్..
హాలోవిజన్ అంటే మనం ఏదైనా కాంతి ఉద్గారాల (లైట్స్, సూర్యడు)ను చూసినప్పుడు దానిచుట్టూ వృత్తాకారంగా ప్రకాశవంత కాంతి కనిపించడం. ఇలా కనిపిస్తే అది కచ్చితంగా గ్లకోమానే అయి ఉంటుంది. వెంటనే అప్రమత్తం కావాలి.
3.అస్పష్టమైన దృష్టి..
అస్పష్టమైన దృష్టి అంటే దేనినీ స్పష్టంగా చూడలేకపోవడం. ఇది మంచి సంకేతం కాదు. దృష్టి అస్పష్టంగా ఉంటే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది గ్లకోమాకు సంకేతం కావచ్చు.
4. జీర్ణ సమస్యలు..
జీర్ణ సమస్యలకూ కంటికి సంబంధం ఉంటుంది. గ్లకోమా వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యంగా ఉంటుంది. వికారం, కడుపులో ఇబ్బంది మొదలైనవి కంటి సమస్యను సూచిస్తాయి. వినడానికి వింతగా అనిపించినా దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.
5.నిరంతర తలనొప్పి..
నిరంతరం తలనొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా కళ్లచుట్టూ నొప్పిగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. కొన్ని పరిస్థితుల్లో ఇది గ్లకోమాకు సంకేతం కావొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

