Childhood obesity | చిన్నారుల్లో ఊబకాయం కారణాలు, ప్రభావాలు.. ఎలా ఉంటాయంటే..?
Childhood obesity | చిన్నారుల్లో ఊబకాయం పెరిగిపోతూ కలవరపెడుతున్నది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మరెన్నో జీవనశైలి కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఒబెసిటీతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయని..
Childhood obesity | మన జీవనశైలి నానాటికి మారిపోతున్నది. ఫలితంగా ఒబేసిటీ, డయాబెటీస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటీవలి కాలంలో పిల్లల్లో అతి బరువు సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. 5 సంత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారుల్లో ఊబకాయం సమస్య తీవ్రమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. చిన్నారుల్లో ఊబకాయం రావడానికి కారణాలు ఏంటో.. వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కారణాలు..
జీన్స్ : మన దేశీయుల్లో ఊబకాయం రావడానికి ముఖ్య కారణం జన్యువులు అని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. కుటుంబంలో ఎవరైనా ఒబేసిటీతో ఉన్నట్లయితే ఆ కుటుంబంలోని పిల్లలకు కాలక్రమేణా ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి.
డైట్ : చిన్నారులు ఎక్కువగా బయటి ఆహారాలు ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు. ఇవి బరువు పెరిగేందుకు దోహదపడతాయి. అలాగే, కృత్రిమ చక్కెరలు ఉండే పానీయాలను తీసుకోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
లైఫ్‌స్టైల్ : ప్రస్తుత కాలంలో పిల్లలు వీడియో గేమ్‌లు ఆడటం, మొబైల్స్ వాడటం ఎక్కువగా ఉన్నది. ఇవి పిల్లల్ని శారీరక శ్రమ లేకుండా చేసి సోమరిపోతుల్లా తయారు చేస్తున్నాయి. ఫలితంగా లావెక్కుతున్నారు.
ఆరోగ్య సమస్యలు..
ఊబకాయం అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. టైప్ 2 డయాబెటీస్, హై బీపీ, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సమస్యలు, స్ట్రోక్, గుండె జబ్బులను కలుగజేస్తుంది.
ముగ్గురిలో ఇద్దరు పిల్లలు జీవితాంతం ఊబకాయంతో ఉంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది.
ఇలా నివారిద్దాం..
- పిల్లలను ఎక్కువసేపు శక్తివంతంగా ఉంచేందుకు ఫైబర్, ప్రోటీన్లతో కూడిన అల్పాహారం ఇవ్వాలి.
- ఒకేసారి ఎక్కువగా భోజనం చేయడానికి బదులు స్మాల్ మీల్స్ అలవాటు చేయాలి.
- చిన్నారులు అదనంగా ఆహారాలు తినకుండా చూడాలి.
- వివిధ రకాల సీజనల్ పండ్లు, కూరగాయలు తినేలా చేయాలి.
- భోజనాలు చేయమని మారం చేసే వారికి సూప్‌లు, జ్యూస్‌ల రూపంలో ఇవ్వాలి.
- నెమ్మదిగా తినడం అలవర్చుకునేలా చేయాలి.
- తినేప్పుడు టీవీ చూడకుండా లేదా స్మార్ట్ఫోన్లను ఉపయోగించకుండా పిల్లల్ని పరిమితం చేయాలి.
- చక్కెర ఎక్కువగా తీసుకోవడం చూడాలి.
- సహజ చక్కెరలు ఉండే పానీయాలు తాగకుండా కనిపెట్టాలి.
- ప్రతిరోజూ ఏదో ఒక ఆట ఆడేలా ప్రోత్సహించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

