Marburg virus | మందులు లేని మరో ప్రాణాంతక వైరస్.. ఇది సోకితే 88 శాతం మరణించే ప్రమాదం
Marburg virus | కరోనాతో ఒకవైపు ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్న సమయంలో కనుమరుగైపోయిందనుకున్న మార్బర్గ్ వ్యాధి మళ్లీ వెలుగుచూసింది.

Marburg virus | కరోనా ( corona virus )తో ఒకవైపు ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్న సమయంలో కనుమరుగైపోయిందనుకున్న మార్బర్గ్ వ్యాధి మళ్లీ వెలుగుచూసింది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ఆగస్టు 2న మరణించిన వ్యక్తికి మార్బర్గ్ వైరస్ సోకినట్టు గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) వెల్లడించింది. ఈ వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది.

ఏమిటీ మార్బర్గ్ వైరస్?
ఎబోలాను కలుగజేసే వైరస్ జాతికి చెందిన ఫిలోవిరిడే అనే వైరస్ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. 1967లో జర్మనీలోని మార్బర్గ్ సిటీలో ఈ వైరస్‌ను తొలిసారిగా గుర్తించడంతో దీనికి ఆ పేరు పెట్టారు. ఈ వ్యాధి సోకిన వారిలో 88 శాతం మంది మరణించే ప్రమాదమున్నది. గుహలు, అడవుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకుతుంది. వ్యాధి సోకిన రోగుల రక్తాన్ని, స్రవాలను తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలేంటి? చికిత్స ఉందా?
తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తిమ్మిరి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ప్రస్తుతానికైతే ఈ వ్యాధి కట్టడికి ఎలాంటి వ్యాక్సిన్లు, ఔషధాలు లేవు. రోగి శరీరంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేందుకు పండ్లరసాలు, ఎలక్ట్రోలైట్ ద్రవాలను ఇవ్వాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

