KIMS Saveera Doctors | పాముకాటును గుర్తించని తల్లిదండ్రులు.. బాలుడి ప్రాణాలు కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు
Kims Saveera Hospital | సాధారణంగా పాము కాటు వేస్తే రెండు గాట్లు పడతాయి. అలాగే కాటు పడిన ప్రాంతంలో వాపు, నొప్పి కూడా ఉంటాయి. కానీ కట్లపాము కాటేస్తే మాత్రం ఇవేవీ కనిపించవు. కానీ.. ఆ తర్వాత కొంతసేపటికి వాంతులు, కడుపునొప్పి, గొంతు నొప్పి లాంటి సాధారణ లక్షణాలుంటాయి.
- కట్ల పాములు కాటేసినా గాట్లు పడవు.. వాపు, నొప్పి ఉండవు
- వాంతులు, కడుపునొప్పి, గొంతునొప్పి లాంటి సాధారణ లక్షణాలే
- తెల్లవారుజామునే ఇవి వస్తే.. పాముకాటుగా గుర్తించాలి
- 12 ఏళ్ల బాబుకు కిమ్స్ సవీరా ఆస్పత్రిలో తక్షణ చికిత్స
- ప్రాణాలు కాపాడిన పిల్లల వైద్యుడు డాక్టర్ మహేష్
అనంతపురం, జూన్ 22, 2024: సాధారణంగా పాము కాటు వేస్తే రెండు గాట్లు పడతాయి. అలాగే కాటు పడిన ప్రాంతంలో వాపు, నొప్పి కూడా ఉంటాయి. కానీ కట్లపాము కాటేస్తే మాత్రం ఇవేవీ కనిపించవు. కానీ.. ఆ తర్వాత కొంతసేపటికి వాంతులు, కడుపునొప్పి, గొంతు నొప్పి లాంటి సాధారణ లక్షణాలుంటాయి. ఇంకా ఎక్కువ సమయం అయితే అప్పుడు నరాల బలహీనత, ఊపిరి అందకపోవడం లాంటివి కనిపిస్తాయి. అందుకే వీటిని పాము కాటుగా తల్లిదండ్రులే కాదు, సాధారణ వైద్యులు కూడా గుర్తించలేరు. సరిగ్గా ఇలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ఎ. మహేష్ తెలిపారు.
“12 ఏళ్ల బాలుడు ఊపిరి సరిగా అందని పరిస్థితిలో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికి అతడి ఆక్సిజన్ శాచ్యురేషన్ కేవలం 66% మాత్రమే ఉంది. చెస్ట్ ఎక్స్‌రే తీసి చూస్తే, న్యుమోనియా లక్షణాల లాంటివి కొన్ని కనిపించాయి. కానీ, ఒక రోజు ముందువరకు బాబుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంటే న్యుమోనియాలో కనిపించే జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ఒక్కటి కూడా లేవు. కానీ ఆక్సిజన్ శాచ్యురేషన్ బాగా తక్కువగా ఉండటంతో ముందుగా వెంటిలేటర్ అమర్చి, చికిత్స మొదలుపెట్టాం.
ఆ తర్వాత అసలు ఏం జరిగిందని ఆరా తీశాం. ముందుగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాబుకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ఆ తర్వాత వాంతులు కావడం మొదలుపెట్టాయి. తెల్లవారు జామున గంటల సమయంలో గొంతు కూడా నొప్పి అనిపించడంతో స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్షణాలు చూసిన అక్కడి వైద్యులు పేగుల్లో ఏదో సమస్య అయి ఉంటుందని భావించి, అందుకు సంబంధించిన మందులు ఇచ్చారు. తర్వాత కొన్ని గంటల పాటు బాగానే ఉన్న బాబుకు.. ఆ తర్వాత ఊపిరి అందని పరిస్థితి ఏర్పడింది. దాంతో వెంటనే కిమ్స్ సవీరా ఆస్పత్రికి తరలించారు. ఈ లక్షణాలన్నీ చూస్తే తప్పనిసరిగా బాబును పాము కాటేసి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చాం. సాధారణంగా పాము కాటు వేస్తే నోటివెంట నురగలు రావడం, నరాలు చచ్చుబడిపోవడం లాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. కానీ, కొన్నిరకాల పాములు కాటు వేస్తే మాత్రం ఇలా ఉండకపోగా.. వేరే లక్షణాలు కనిపిస్తాయి.
పాము కాటు అని నిర్ధారణ కావడంతో బాబుకు ముందుగా పాము విషానికి విరుగుడు అయిన ఏఎస్వీ (యాంటీ స్నేక్ వీనం) ఇంజెక్షన్లు ఇచ్చి, దాంతోపాటు కాల్షియం కూడా ఇవ్వడంతో రెండు రోజుల తర్వాత బాబు పూర్తిగా కోలుకున్నాడు. అతడి ఆక్సిజన్ శాచ్యురేషన్ కూడా సాధారణ స్థాయికి రావడంతో వెంటిలేటర్ తొలగించి, రెండు రోజుల్లోనే డిశ్చార్జి చేశాం.
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఎవరైనా కింద పడుకుని, తెల్లవారి లేవగానే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ, ఆ తర్వాత గొంతునొప్పి, వాంతులు, నరాల బలహీనత లాంటివి కూడా మొదలైతే దాన్ని పాముకాటుగా అనుమానించి, వెంటనే తగిన చికిత్స అందజేయాలి. ఆలస్యం అయ్యేకొద్దీ పరిస్థితి విషమిస్తుంది” అని డాక్టర్ మహేష్ వివరించారు.
————————————–
For media, please contact: Giri @ 9963445785
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

