Covid Booster dose | పిల్లలకు కొవిడ్ బూస్టర్ డోస్‌పై డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే..
ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, కౌమార బాలబాలికలు కొవిడ్-19 టీకాలు అదనంగా తీసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా సలహా ఇచ్చింది. అయితే, ఇతర టీకాలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. రోటావైరస్, తట్టు (మీజిల్స్), న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ లాంటి అత్యవసర సంప్రదాయ టీకాలతో పోలిస్తే పిల్లలు, కౌమార బాలబాలికల మీద కొవిడ్ టీకాల ప్రభావం చాలా తక్కువని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఆ కొవిడ్ 19 టీకాలను వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు కేటాయిస్తే మంచిదనీ పేర్కొన్నది.
పిల్లలకు కొవిడ్ బూస్టర్ వద్దు: డబ్ల్యూహెచ్ఓ
Covid Booster dose | ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, కౌమార బాలబాలికలు కొవిడ్-19 టీకాలు అదనంగా తీసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా సలహా ఇచ్చింది. అయితే, ఇతర టీకాలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. రోటావైరస్, తట్టు (మీజిల్స్), న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ లాంటి అత్యవసర సంప్రదాయ టీకాలతో పోలిస్తే పిల్లలు, కౌమార బాలబాలికల మీద కొవిడ్ టీకాల ప్రభావం చాలా తక్కువని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఆ కొవిడ్ 19 టీకాలను వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు కేటాయిస్తే మంచిదనీ పేర్కొన్నది.
రోబో టీచర్లకే ఓటు
బడిలో కొత్తగా చేరబోయే బిడ్డలు సాధారణ టీచర్ల కంటే రోబోల దగ్గర పాఠాలు నేర్చుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు కాంకార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఆ పరిశోధన కోసం.. పిల్లల ఎదురుగా సాధారణ ఉపాధ్యాయులతో పాటు రోబో టీచర్లనూ ఉంచారు. ‘ఎంపిక మీ ఇష్టం’ అని చెప్పారు. మెజారిటీ పిల్లలు రోబో మాస్టార్నే కోరుకున్నారు. ఈ అధ్యయనంలో అనా ఎలిసబెత్ బౌమన్ అనే నిపుణురాలు ప్రధానపాత్ర పోషించారు.
బరువు పెరిగినా సరే
బరువు తగ్గడం అనేది గుండె కవాటాల వ్యాధి, టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుంది. అయితే, ఇలా బరువు తగ్గిన తర్వాత మళ్లీ, కొంత పెరిగినా కూడా, కనీసం ఐదేండ్ల వరకు ఆరోగ్యానికి వచ్చే ఇబ్బందేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ‘సర్క్యులేషన్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. బరువు తగ్గడానికి ఏ ప్రయత్నమూ చేయనివారి కంటే, ప్రయత్న పూర్వకంగా బరువు తగ్గించుకున్న వాళ్లలో సిస్టోలిక్ రక్తపోటు స్థాయులు, చెడు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉన్నాయట.
నీళ్ల బాటిళ్లపై బ్యాక్టీరియా
అమెరికాకు చెందిన ఓ వెబ్సైట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. టాయిలెట్ సీట్ కంటే కూడా మళ్లీ మళ్లీ ఉపయోగించే నీళ్ల సీసాలపైనే బ్యాక్టీరియా 40 వేల రెట్లు అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి, గ్రామ్ నెగెటివ్ రాడ్స్, బాసిల్లస్ అనే రెండు రకాల బ్యాక్టీరియాను కనుగొన్నారు. అందుకే ఈ బాటిళ్లను పరిశోధకులు ప్రయోగ శాలల్లో సూక్ష్మజీవులను వృద్ధి చేయడానికి ఉపయోగించే ‘పెట్రి డిష్’తో పోల్చారు. ఇకనుంచీ నీళ్ల బాటిళ్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

