Body weight | పుట్టగొడుగులతో శరీరం బరువు తగ్గుతుందా? నిజాలు ఇవి..!
Body weight | ఆరోగ్యానికి దివ్య ఔషధంగా చెప్పుకునే పుట్టగొడుగులను వివిధ రకాలుగా వంటల్లో వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. మన శరీరాన్ని అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి...
Body weight | గత కొన్ని రోజులుగా మన జీవనశైలిలో మార్పులు కనిపిస్తున్నాయి. చాలా మంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఏది తినాలో.. ఏది తినకూడదో.. మంచిచెడులను తెల్సుకుంటున్నారు. ఒకప్పుడు పుట్టగొడుగులు తినేందుకు వెనకంజే వేసేవారు ఇప్పుడు ఇష్టంగా తింటున్నారు. వీటి ప్రయోజనాలు తెలియడంతో వాటిని తినకుండా ఉండలేకపోతున్నారు.
ఆరోగ్యానికి దివ్య ఔషధంగా చెప్పుకునే పుట్టగొడుగులను వివిధ రకాలుగా వంటల్లో వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సీ, బీ, డీ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం ద్వారా మన శరీరాన్ని అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. పుట్టగొడుగుల్లో 92 శాతం నీరు ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పోషకాలు, తక్కువ క్యాలరీలను కలిగి ఉండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
పుట్టగొడుగులలో ఉండే పాలిశాకరైడ్స్ మన శరీరం అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిని తినడం వలన ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ సమృద్ధిగా లభింస్తుంది. దాంతో ఎక్కువ సమయం పాటు ఆకలి లేకుండా ఉంటుంది. ఎక్కువ సార్లు ఆహారం తీసుకోకుండా చేస్తుంది. దీని వల్ల శరీరం బరువు తగ్గిపోతుంది.
ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు..
- శరీరంలో పేరుకుపోయే కొవ్వులను కరిగిస్తుంది. దీని వల్ల కూడా మన శరీరం బరువు తగ్గిపోతుంది.
- బరువు తగ్గాలనుకునేవారు వారానికి కనీసం రెండు సార్లయినా వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.
- వీటిలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తి బలపడుతుంది.
- మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది.
- జీర్ణశక్తి బలపడుతుంది.
- బీపీని కంట్రోల్లో ఉంచడంలో పుట్టగొడుగులు గ్రేట్‌గా పనిచేస్తాయి.
- కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
- డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
- పుట్టగొడుగులలో ఉండే ఐరన్.. అనీమియా ఉన్న పేషెంట్లలో రక్తం పెరిగేలా చేస్తుంది.
- ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.
- వీటిలో లభించే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
- వీటిలో ఉండే సెలీనియం చర్మాన్ని మృధువుగా మార్చి.. వృద్ధాప్య ఛాయలను అంత త్వరగా రానివ్వదు.
- వీటిని తినడం వల్ల కాపర్, పొటాషియం అంది వెంట్రుకల సాంద్రతను పెంచి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

