బరువు తగ్గితే ప్రమాదమే!

శిశువు ఆరోగ్యం, పెరుగుదల, అభివృద్ధిని నిర్ణయించే అనేక విషయాల్లో అతి ముఖ్యమైంది.. జన్మించినప్పుడు శిశువు బరువే. పుట్టిన వెంటనే శిశువు బరువు 2500 గ్రాములకన్నా తక్కువ ఉంటే, ‘బరువు తక్కువ బిడ్డ’గా పరిగణిస్తారు. 1500 గ్రాముల కన్నా తక్కువైతే ‘మరీ బరువు తక్కువ బిడ్డ’ అని అంటారు. ఇక, 1000 గ్రాముల కన్నా తక్కువ ఉంటే ‘మరీ మరీ బరువు తక్కువ’ జాబితాలో చేర్చాల్సిందే. మన దేశంలో జన్మించే శిశువులలో 30-40 శాతం మంది బరువు తక్కువవారే. గర్భస్థ దశలో లేదా జన్మించిన కొద్ది గంటలలో మరణించే శిశువులలో 70 శాతం మంది బరువు తక్కువ బిడ్డలే. శిశువు పుట్టిన మొదటి నెలలో సంభవించే మరణాలలో 75-90 శాతం తక్కువ బరువుతో ముడిపడినవే. గత 20 సంవత్సరాలలో 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు 50 శాతం తగ్గినా, జన్మించిన మొదటి నెలలో శిశు మరణాల్లో మాత్రం గణనీయమైన మార్పేమీ లేదు. దీనికి కారణం, మనం బరువు తక్కువ శిశు జననాలను తగ్గించలేక పోవడమే. ఒక సంవత్సరం వయసు తర్వాత కూడా వీరిలో 40 శాతం మంది ఆహార లోపాలతో పొట్టిగా, బలహీనంగా ఉంటారు. అంటువ్యాధుల ఆస్కారమూ ఎక్కువే.
రెండు కారణాలు
బిడ్డ తక్కువ బరువుతో జన్మించడానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి, నెలలు నిండకుండా జన్మించడం. రెండు, నెలలు నిండినా గర్భంలో పెరుగుదల లోపాలు. ఫలదీకరణ తర్వాత అండం పిండంగా మారినప్పుడు 0.005 మిల్లీ గ్రాములు ఉంటుంది. 28 వారాలకు పిండం బరువు దాదాపు ఒక కిలో, పొడవు 35 సెం. మీ, 40 వారాలకు 2800 గ్రా. బరువు, 48 సెం.మీ. పొడవు, తల చుట్టుకొలత 35 సెం.మీ. ఉంటుంది. అసలు, బిడ్డ సరైన బరువుతో జన్మించాలంటే ఎలాంటి
జాగ్రత్తలు తీసుకోవాలన్నది త్వరలోనే చర్చించుకుందాం.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- baby weight
- pediatric
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

