Health Tips | చలికాలంలో బాలింతలు, పసిబిడ్డలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
Health Tips | ప్రసవమైన ఆరు వారాల వరకూ బాలింతగా పరిగణిస్తాం. బాలింతలు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. పసి బిడ్డనూ ఈ సమయంలో భద్రంగా చూసుకోవాలి. ఒకప్పుడు పురిటి గదిలోకి ఎవరూ వెళ్లేవారు కాదు.
Health Tips | నమస్తే డాక్టర్. చలికాలం బాలింతలు, పసిబిడ్డల గురించి ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పాతతరం పాఠాలకు, కొత్తతరం పద్ధతులకు ఎంతో అంతరం ఉంటున్నది. ఈ పరిస్థితుల్లో కొత్తగా మాతృత్వాన్ని ధరించినవాళ్లు ఆహార, విహారాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
- ఓ పాఠకురాలు
ప్రసవమైన ఆరు వారాల వరకూ బాలింతగా పరిగణిస్తాం. బాలింతలు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. పసి బిడ్డనూ ఈ సమయంలో భద్రంగా చూసుకోవాలి. ఒకప్పుడు పురిటి గదిలోకి ఎవరూ వెళ్లేవారు కాదు. పసిబిడ్డను ముట్టుకునేవాళ్లు కూడా కాదు. అది మంచి పద్ధతి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ తల్లీబిడ్డలను తాకుతున్నారు. దీనివల్ల వీళ్లు జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ. మామూలుగా బాలింతలకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువ. అందువల్ల, తలగుడ్డలాంటివి కట్టుకోవడం ద్వారా చల్లగాలి సోకకుండా జాగ్రత్తపడాలి. ఈ సమయంలో న్యుమోనియాలాంటివి సోకితే చాలా ప్రమాదం. బాలింతలు కాచి చల్లార్చిన నీళ్లే తాగాలని చెబుతుంటారు. అలా తాగడం కష్టమే. దీంతో తాగాల్సినన్ని నీళ్లు తాగరు. దీనికితోడు, నీళ్లు ఎక్కువ తాగితే పొట్ట వస్తుందన్న అపోహ ఉంది.
అందువల్ల కాచి చల్లార్చినవే కాదు, శుభ్రమైన నీళ్లూ ఎక్కువగా తాగాలి. అలాగే, ఆరువారాల లోపు పసిబిడ్డను నిరంతరం వెచ్చగా ఉంచాలి. మనకు భిన్నంగా వాళ్ల శరీరంలో ఉండే బ్రౌన్ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. అందువల్ల చలి వాతావరణానికి లోనైతే గబగబా శరీరం చల్లబడిపోయే హైపోథార్మియా… అనే ప్రమాదకర పరిస్థితి తలెత్తవచ్చు. అందుకే ఈ సమయంలో గోరువెచ్చని నీళ్లలో వస్ర్తాన్ని ముంచి ఒళ్లు తుడిస్తే చాలు. స్నానం చేయించినా ఎండపడ్డాకే. చలిగాలికి ఎక్కువగా తిప్పకూడదు. మూత్రానికి వెళ్లినా, దొడ్లోకి పోయినా వెంటనే డైపర్ మార్చాలి. ఈ జాగ్రత్తలు శ్రద్ధగా పాటిస్తే చలికాలం సమస్యలను సులభంగానే దాటేయొచ్చు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

