మధుమేహం.. ఆయుర్వేదం
మధుమేహం దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధి. గత నాలుగేండ్లలో దేశంలో 10 కోట్లమంది కొత్త రోగులు పుట్టుకొచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, వ్యాయామం, ఆయుర్వేద మూలికలతో రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో తెచ్చుకోవడం సాధ్యమేనని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. ఈ మూలికలు మధుమేహ మహమ్మారి నియంత్రణలో ఎంతో సాయపడతాయి.
మధుమేహం దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధి. గత నాలుగేండ్లలో దేశంలో 10 కోట్లమంది కొత్త రోగులు పుట్టుకొచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, వ్యాయామం, ఆయుర్వేద మూలికలతో రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో తెచ్చుకోవడం సాధ్యమేనని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. ఈ మూలికలు మధుమేహ మహమ్మారి నియంత్రణలో ఎంతో సాయపడతాయి.
తిప్పతీగ
శాస్త్రీయనామం టినోస్పోరా కార్డిఫోలియా. ఇది శరీరంలో ఇన్సులిన్ విడుదలను ప్రభావితం చేసి చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. పాంక్రియాటిక్ బీటా సెల్స్‌ను సంరక్షిస్తాయి. డయాబెటిస్తో సంబంధం కలిగిన ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. మధుమేహ రోగులకు తిప్పతీగ ఆరోగ్యప్రదాయిని.
కాకర
చేదు కాకరను ఆయుర్వేదంలో అనాదిగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇందులో మధుమేహాన్ని కట్టడిచేసే లక్షణాలు ఉన్నాయి. కాకరలో ఉండే పాలిపప్టైడ్ పి రక్తంలో చక్కెరను తగ్గించడంలో దోహదపడుతుంది. అంతేకాదు, కాకర శరీరం గ్లూకోజ్‌ను వినియోగించుకునే క్రమాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ విడుదలను క్రమబద్ధం చేస్తుంది కాబట్టి, డయాబెటిస్ నిర్వహణకు
మంచి ఎంపికగా నిలుస్తుంది.
నేరేడు
వానకాలంలో విరివిగా దొరికే పండు. దీనిలో హైపోైగ్లెసిమిక్ లక్షణాలు ఉంటాయి. అలా రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సాయపడుతుంది. నేరేడులో ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం, పాలిఫినాల్స్ లాంటి మూలకాలూ ఉంటాయి. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. నేరేడు తినడం, రసం తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, మధుమేహం వల్ల తలెత్తే ఇతర సమస్యల ముప్పును తగ్గిస్తుంది. ఇందులో అధిక డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర కలిసిపోయే క్రమాన్ని నెమ్మదింపజేస్తుంది. రోజువారీ ఆహారంలో గుప్పెడు నేరేడు పండ్లను భాగం చేసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉన్నట్టే.
పొడపత్రి
జిమ్నెమా సిల్వెస్టర్ దీని శాస్త్రీయనామం. పుట్టభద్ర, మధునాశిని మారుపేర్లు. పొడపత్రి డయాబెటిస్ నిర్వహణకు ప్రకృతి అందజేసిన అద్భుతమైన ఆకు. రక్తంలో గ్లూకోజ్ కలిసిపోయే క్రమాన్ని తగ్గించడం ద్వారా చక్కెర స్థాయులను కట్టడి చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. పైగా చక్కెర అంటే చెవికోసుకొనే చాపల్యాన్ని వదల గొడుతుంది. ఇన్సులిన్‌ను స్రవించే క్లోమగ్రంథికి అండగా నిలుస్తుంది.
ఉసిరి
ఆయు ర్వేదంలో ఉసిరి ఓ అద్భుతమైన వనమూలిక. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచడం.. ఉసిరి కలిగించే ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి.. విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్ల గని అయిన ఉసిరి శరీరంలో క్లోమ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది. మధుమేహంతో సంబంధం కలిగిన ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయకారి.
..ఇవన్నీ మధుమేహ రోగికి సమగ్ర రక్షణ ఇవ్వకపోవచ్చు. కానీ, రక్తంలో చక్కెర స్థాయుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరచడం మొదలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం వరకు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

