Knee Pains | చిన్న చిన్న అలవాట్లను పాటిస్తే.. మోకాళ్ల నొప్పులు రాకుండా చూసుకోవచ్చు..
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం యుక్త వయస్సు వారి నుంచి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. నడక, మెట్లు ఎక్కడం, వ్యాయామం చేయడం, కూర్చుని లేవడం వంటి ప్రతి రోజువారీ కదలికలో మోకాళ్ల పాత్ర ఎంతో కీలకం. అందువల్ల ఇవి శరీరంలో ఎక్కువగా ఉపయోగించబడే భాగాలుగా ఉండటంతోపాటు గాయాలకు కూడా సులభంగా గురవుతాయి.
Knee Pains | మోకాళ్ల నొప్పి ప్రస్తుతం యుక్త వయస్సు వారి నుంచి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. నడక, మెట్లు ఎక్కడం, వ్యాయామం చేయడం, కూర్చుని లేవడం వంటి ప్రతి రోజువారీ కదలికలో మోకాళ్ల పాత్ర ఎంతో కీలకం. అందువల్ల ఇవి శరీరంలో ఎక్కువగా ఉపయోగించబడే భాగాలుగా ఉండటంతోపాటు గాయాలకు కూడా సులభంగా గురవుతాయి. జీవనశైలిలో మార్పులు, గంటల తరబడి కూర్చునే అలవాటు, అధిక బరువు, క్రీడల వల్ల గాయాలు వంటి కారణాలతో ప్రస్తుతం మోకాళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని చిన్నచిన్న అలవాట్లను పాటించడం ద్వారా భవిష్యత్తులో మోకాళ్ల సమస్యలను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గాలి..
ముందుగా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువు మోకాళ్లపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అదనపు కిలో బరువు నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లపై రెండింతలు నుంచి మూడింతల వరకు ఒత్తిడిని పెంచుతుంది. దీని వల్ల మోకాళ్లలోని కార్టిలేజ్ త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యకరమైన బరువును అనుసరించడం అవసరం. అలాగే మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుచుకోవాలి. మోకాళ్ల స్థిరత్వాన్ని కాపాడడంలో కండరాల పాత్ర చాలా ముఖ్యమైనది. స్క్వాట్స్, లెగ్ రైజెస్, సైక్లింగ్, తక్కువ ఒత్తిడితో చేసే వ్యాయామాలు కండరాలను బలపరచి మోకాళ్లకు మద్దతు ఇస్తాయి. ఇలా కండరాలు బలంగా ఉంటే రోజువారీ పనులు లేదా క్రీడల సమయంలో గాయాల ప్రమాదం తగ్గుతుంది.
సరైన పాదరక్షలు, భంగిమ అవసరం..
అదే విధంగా సరైన చెప్పులు ధరించడం కూడా అవసరం. పాదరక్షలు మోకాళ్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. మెత్తని కుషన్ ఉన్న చెప్పులు మోకాళ్లపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. సరైన ఫిట్ లేని లేదా పాడైపోయిన చెప్పులు మోకాళ్ల నొప్పి, వాపు వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి నాణ్యమైన పాదరక్షలు ఉపయోగించడం మంచిది. అలాగే సరైన భంగిమను పాటించాలి. తప్పుడు విధంగా కూర్చోవడం, నిలబడటం లేదా బరువులు ఎత్తడం మోకాళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి. ఎక్కువసేపు వంగి కూర్చోవడం లేదా సరైన పొజిషన్లో లేకపోవడం వెన్నెముక, నడుము, మోకాళ్ల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి నిటారుగా కూర్చోవడం, సరైన విధంగా వంగడం వంటి అలవాట్లు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటితో పాటు పోషకాహారం కూడా తీసుకోవాలి. మోకాళ్ల ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.
ఆహారం కూడా ముఖ్యమే..
కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం ఎముకలను బలపరుస్తుంది. అలాగే చేపలు, అవకాడో, గుడ్లు, పాలు, ఆకుకూరలు వంటి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారం కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నపాటి మోకాళ్ల నొప్పి, వాపు లేదా గట్టిపడటం వంటి లక్షణాలను చాలామంది తాత్కాలిక సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ ఇవే భవిష్యత్తులో దీర్ఘకాలిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలోనే సరైన వైద్య సలహా, చికిత్స తీసుకుంటే పెద్ద సమస్యలను నివారించవచ్చు. మోకాళ్ల నొప్పి ఏ వయసువారికైనా రావచ్చు. అయితే బరువును నియంత్రించడం, క్రమం తప్పని వ్యాయామం చేయడం, సరైన చెప్పులు ధరించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి చిన్నచిన్న అలవాట్లు దీర్ఘకాలంలో మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- knee pains
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

