Jaggery At Night | ఈ సీజన్లో రోజూ రాత్రి చిన్న బెల్లం ముక్కను తినడం మరిచిపోవద్దు.. ఎందుకంటే..?
ప్రస్తుతం నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో గాలి కాలుష్యం ఎక్కువవుతోంది. ఫలితంగా చాలా మందికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
Jaggery At Night | ప్రస్తుతం నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో గాలి కాలుష్యం ఎక్కువవుతోంది. ఫలితంగా చాలా మందికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో దుమ్ము, ధూళి పేరుకుపోతున్నాయి. కాలుష్య కారకాలు చేరుతున్నాయి. దీంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మన ఆహారంలో బెల్లంను చేర్చుకుంటే శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులతోపాటు గొంతులో ఉండే కఫం, కాలుష్య కారకాలు బయటకు వెళ్లిపోతాయి. కనుక కాలుష్య భరితమైన వాతావరణంలో నివసించే వారు బెల్లంను రోజూ తినాల్సి ఉంటుంది.
ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..
బెల్లంను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. రోజూ రాత్రి భోజనం చేసిన అనంతరం చిన్న బెల్లం ముక్కను తింటే చాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన టాక్సిన్లు, వ్యర్థాలు బయటకు పోతాయి. బెల్లంలో మెగ్నిషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాయు మార్గాల్లో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. దీంతో ఊపిరితిత్తుల్లోని కాలుష్య కారకాలు బయటకు పోతాయి. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. కాలుష్య భరితమైన వాతావరణంలో ఉండే వారు బెల్లంను తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఎప్పటికప్పుడు పేరుకుపోయే టాక్సిన్లను బయటకు పంపవచ్చు.
కఫం మొత్తం కరుగుతుంది..
రాత్రి పూట భోజనం చేసిన అనంతరం చిన్న బెల్లం ముక్కను తిని గోరు వెచ్చని నీళ్లను ఒక గ్లాస్ తాగాలి. దీని వల్ల కఫం మొత్తం కరిగిపోతుంది. మన శరీరంలో రోజూ ముక్కు, వాయు మార్గాలు, గొంతు, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. ఫలితంగా బాక్టీరియా, వైరస్లు చేరుతాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే బెల్లంను తిని గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటే ఇలా పేరుకుపోయే కఫం మొత్తం కరుగుతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక రోజూ బెల్లంను తింటే మంచిది. అలాగే బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో సెలీనియం ఉంటుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. దీంతో ఊపిరితిత్తుల కణాలు డ్యామేజ్ అవకుండా ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో వాపులు తగ్గుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
రోగ నిరోధక శక్తికి..
కాలుష్యం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీర రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా మనకు అనేక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే బెల్లంను తింటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు అవసరం అయిన విటమిన్లు, మినరల్స్‌ను బెల్లం అందిస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి కణాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా శరీరం బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాటం చేస్తుంది. దీంతో బ్రాంకైటిస్, సైనస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా బెల్లం ఉపయోగపడుతుంది. కనుక చలికాలంలో శ్వాసకోశ సమస్యలకు దూరంగా ఉండాలనుకునేవారు, వాటి నుంచి ఉపశమనం పొందాలని అనుకునేవారు రోజూ చిన్న బెల్లం ముక్కను తింటుండాలి. దీంతో అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Jaggery
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

