Health Tips | ఎముకలు బలంగా అవ్వాలా? అయితే వీటిని రెగ్యులర్‌గా తినండి

అదే ఎముకలు బలహీనమై.. బోలు బోలుగా తయారైతే ఏ పనిచేయలేం.. చిన్న ఒత్తిడికే ఎముకలు పుటుక్కున విరిగిపోతాయి. ఆస్టియోపోరోసిస్ వల్ల ఇప్పుడు ఈ సమస్య వస్తుంది. ఒకప్పుడు వయసు మీద పడినప్పుడు మాత్రమే వచ్చే ఈ సమస్య ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చిన్నతనంలోనే వస్తుంది.

శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి.

అందుకే ఎముకలు బలంగా ఉండేందుకు మంచి ఆహారం తినాలి. ఈ సమ్మర్లో దొరికే సీజనల్ పండ్లను తినడం ద్వారా కూడా ఎముకల దృఢత్వాన్ని పెంచుకోవచ్చు.. అవేంటో చూద్దాం..

ఎండాకాలంలో దొరికే పైనాపిల్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని యాసిడ్ లోడ్‌ను నియంత్రించి.. కాల్షియం లోటును తగ్గిస్తుంది. అంతేకాకుండా పైనాపిల్‌లో విటమిన్ ఏ, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల పుష్టికి దోహదపడుతాయి.

స్ట్రాబెర్రీలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఎముకలు గుల్లగా మారడాన్ని అడ్డుకుంటాయి. అలాగే స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

యాపిల్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు యాపిల్ తింటే డాక్టర్ అవసరం రాడని అంటారు. ఎముకలు బలంగా ఉండేందుకు, కొత్త ఎముక కణాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడే విటమిన్ సీ ఇందులో పుష్కలంగా లభిస్తుంది.

బొప్పాయిని కొంచెం తిన్నా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎముకలను దృఢంగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ సీ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. బొప్పాయి తింటే చర్మం నిగనిగలాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది.

టమాటాల్లో విటమిన్ కే, కాల్షియం, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
