అధిక బరువు తగ్గడం అంత ఆషామాషీ కాదు. రాత్రికే రాత్రే ఎవరూ బరువు తగ్గలేరు. రోజూ నడవడం, వర్కౌట్స్ తప్పనిసరి. ఆహార నియమాలు పాటించాలి. నిత్యం చురుకైన జీవనశైలిని నిర్వహించాలి. అయితే, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిరంతరం ఈ కింది చిట్కాలను పాటిస్తుంటే అధిక బరువుకు చెక్పెట్టొచ్చని అంటున్నారు.
1. కార్బోహైడ్రేట్స్పై దృష్టిపెట్టాలి..
అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు. కనుక కార్బొహైడ్రేట్లను మితంగా తీసుకోవాలి. అయితే, వీటిని పూర్తిగా మానేయడం మంచిది కాదు.
2. ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి..
శరీర విధులను నిర్వహించేందుకు నీరు అత్యంత అవసరం. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగితే ప్రయోజనకరం.
3.ఆరోగ్యకరమైన పానీయాలే తాగాలి..
బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యకరమైన పానీయాలనే తాగాలి. చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ తాగొద్దు. కార్బొనేటెడ్ సోడాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా గ్రీన్ టీ, లెమన్ వాటర్, దోసకాయలు నానబెట్టిన నీళ్లు తాగొచ్చు.
4.ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి..
ఎముకలు, కండర నిర్మాణానికి ఈ పోషకం ముఖ్యమైనది. బరువు తగ్గించే ప్రక్రియలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కనుక ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
5. వ్యాయామం తప్పనిసరి
ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. 15 నిమిషాలు సమయమున్నా ఆ టైంలో చిన్నచిన్న వర్కౌట్స్ చేసేందుకు ప్రయత్నించాలి. సమయం లేదనే సాకుతో ఎక్సర్సైజ్ను స్కిప్ చేయొద్దు.