Alkaline water | ఆల్కలీన్ నీరు తాగడం మంచిదేనా..? ఎందుకు తాగాలి..?
Alkaline water | తాగే నీటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. సాధారణంగా తీసుకునే నీటిలో పీహెచ్ స్థాయి తక్కువగా ఉంటుంది. అయితే, ఈ ఆల్కలీన్ వాటర్‌లో పీహెచ్ స్థాయి ఎక్కువగా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తుంది.
Alkaline water | మనం సాధారణంగా దాహం వేయగానే నీరు తాగుతుంటాం. అయితే, మనం తాగే నీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలతోపాటు సూక్ష్మక్రిములు కూడా ఉంటాయి. వీటిలో కొన్ని మనకు ఆరోగ్యం చేకూర్చుతుండగా.. మరికొన్ని అనారోగ్యం పాలుచేస్తుంటాయి. తాగే నీటిలో ఖనిజాలు ఏయే పాళ్లలో ఉండాలనే దానిపై మనలో ఎక్కువ మంది విజ్ఞానం లేకపోవడంతో ఏదో ఒక నీటిని తాగి దాహం తీర్చుకుంటున్నాం.
ప్రస్తుతం మార్కెట్లో డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్, డబుల్ ఆర్ఓ వాటర్, ఆల్కలీన్ వాటర్ (బ్లాక్ వాటర్).. ఇలా ఎన్నో రకాల తాగు నీరు దొరుకుతున్నాయి. వీటిలో ఏ నీరు మంచిదనే దానిపై మనలో చాలా మందికి విషయపరిజ్ఞానం కొరవడింది. నీటిని సరఫరా చేసే కంపెనీల మాటలు నమ్మి ఆయా కంపెనీల నీటిని కొనుగోలు చేస్తుంటాం. నిజానికి, పీహెచ్ తక్కువగా గానీ, ఎక్కువగా గానీ ఉండే వాటర్ తాగడానికి పనికిరాదని పరిశోధకుల మాట. సాధారణ నీటిలో పీహెచ్ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అయితే, ఆల్కలీన్ నీటిలో పీహెచ్ స్థాయి 8, 9 గా ఉంటుంది. ఇలా పీహెచ్ స్థాయిలు 8, 9 గా ఉన్న నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. ఈ నీటినే ఆల్కలీన్ ఆయోనైజ్డ్ వాడర్ అని కూడా పిలుస్తారు.
ఆల్కలీన్ వాటర్‌తో ప్రయోజనాలివీ..
- రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది.
- హై కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది.
- శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది.
- ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
- రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది.
- జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది.
- కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్ చేసి ఆసిడ్ రిఫ్లక్స్, గుండె మంటను దూరం చేస్తుంది.
- శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించి వేస్తుంది.
- దీర్ఘకాలిక వ్యాధి అయిన మస్క్యులో స్కెలెటర్ నొప్పులను తగ్గిస్తుంది.
- కండరాలు బాగా లూబ్రికేట్ అయ్యేలా అల్కలీన్ వాటర్ సాయపడుతుంది.
ఏవైనా దుష్పరిణామాలుంటాయా?

శరీరాన్ని సౌష్టవంగా, ఫిట్‌గా ఉంచేందుకు వ్యాయామాలు చేసే వారు చెమట బయటకు వెళ్లిపోయిన తర్వాత శరీరానికి ఎలక్ట్రోలైట్‌ను అందించేందుకు ఈ ఆల్కలీన్ వాటర్ తాగుతుంటారు. అందాన్ని కాపాడుకునేందుకు సినీ తారలు, మోడల్స్ ఎక్కువగా ఈ నీటినే తాగుతుంటారు. అయితే, ఈ నీటిని మరీ ఎక్కువగా తాగితే, వికారం, వాంతులు, శరీర ద్రవాల పీహెచ్ స్థాయిల్లో మార్పులు వంటివి వచ్చే అవకాశముందని ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కు ప్రొఫెసర్ మరీనా మెర్న్ నేతృత్వంలో చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నీటిని తాగడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ను కూడా కాపాడుకోవచ్చు.
ధర కొంచెం ఎక్కువే..
మన దేశంలో చాలా తక్కువ సంఖ్యలో అల్కలీన్ వాటర్ దొరుకుతున్నది. ఇక్కడ దొరికే ఇవోకస్ వాటర్.. 500 ఎంఎల్ ఆరు బాటిళ్లను రూ.600 కు అందిస్తున్నది. ఈ నీటిలో 32 మి.గ్రా. కాల్షియం, 21 మి.గ్రా. మెగ్నిషియం, 8 మి.గ్రా. సోడియం ఉంటాయని ఇవోకస్ సంస్థ చెప్తున్నది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

