New Study | రెగ్యులర్గా కూల్డ్రింక్స్ తాగుతున్నారా? అయితే, ఆ సామర్థ్యం తగ్గిపోతుందట!
కోకాకోలా.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే డ్రింక్. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ, ఇతర జంక్ఫుడ్ తిన్న తర్వాత చాలామంది తప్పకుండా కోక్ తాగుతారు. అయితే, కోకాకోలాతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేకపోగా ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయట. రెగ్యులర్గా కోకాకోలా ఆధారిత శీతలపానీయాలు తాగేవారు అధిక బరువు, మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడతారని పలు అధ్యయనాల్లో తేలింది. కాగా, కోకాకోలా తాగేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, తద్వారా కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనాన్ని బ్రెజిల్లోని శాంటా కాటరినా విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్వహించారు. ఎలుకలపై వీరు ప్రయోగం నిర్వహించారు. వాటిని రెండు గ్రూపులుగా విభజించి ఒక సమూహానికి నీరు, రెండో సమూహానికి కోక్, నీరు అందించారు. కోక్ తాగిన సమూహం పేలవమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నదని గుర్తించారు. అభిజ్ఞా పనితీరుతోపాటు కోలా తాగిన ఎలుకల సమూహం ఆక్సీకరణ ఒత్తిడిని కలిగి ఉందని కనుగొన్నారు. శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. టాక్సిన్స్ సరిగ్గా బయటకు వెళ్లకపోతే అది ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవే ఫలితాలు మనుషుల్లోనూ కనిపిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా శీతల పానీయం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి లోపం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని తేల్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు శీతలపానీయాలు తాగే అలవాటు ఉంటే త్వరగా మాన్పించాలని పరిశోధకులు సూచించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!