Fatty Liver | ఆధునిక జీవనశైలితో మద్యం సేవించే వారితో పాటు మద్యం తీసుకోని వారిలోనూ (నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్) ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. లివర్‌లో అధికంగా కొవ్వు పేరుకుపోవడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ పరిస్ధితి నివారించడం, నియంత్రించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధి ముప్పును తగ్గించేందుకు ఆరోగ్యకర ఆహారాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారంలో ముఖ్యంగా పాలకూర వంటి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ వంటి విటమిన్స్, మెగ్నీషియం వంటి మినరల్స్ అధికంగా ఉండే ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి.
ఇవి లివర్‌లో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రిస్తాయి. ఇక ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే సాల్మన్, మాక్రెల్, సార్డినెస్ వంటి ఫ్యాటీ ఫిష్‌లు లివర్‌లో ఫ్యాట్ లెవెల్స్, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఒమెగా 3 ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇక ఒలెరుపిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా లివర్ ఇన్ప్లమేషన్ను తగ్గిస్తాయి. ఇక ఈ పది ఆహారాలను డిన్నర్లో తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను నియంత్రించవచ్చు..
ఆకుకూరలు
ఫ్యాటీ ఫిష్
ఆలివ్ ఆయిల్
నట్స్, సీడ్స్
అవకాడో
వెల్లుల్లి
బెర్రీస్
గ్రీన్ టీ
పసుపు
తృణధాన్యాలు
Read More :
Paris Olympics 2024 | వాకింగ్‌లో అత్యుత్తమ టైమింగ్.. భారత అథ్లెట్‌కు ఒలింపిక్స్ బెర్త్