ప్రతీకార విధ్వంసం
అమృతోత్సవాల దేశ అభివృద్ధి పరుగులు అసమర్థత, అవినీతికి అందమైన మెరుగులు
అమృతోత్సవాల దేశ
అభివృద్ధి పరుగులు
అసమర్థత, అవినీతికి
అందమైన మెరుగులు
దేశభక్తి జాతీయత
దేదీప్యపు కాంతులు
అయినా ఇంకా విద్వేషం
అసహనపు వాంతులు
కార్పొరేట్ ధనస్వామ్యం
కబ్జాలో దేశ పరుగు
అట్టడుగు వర్గాలకు
అందకుండా కలె తిరుగు
పరిపాలన విధానాలు
పట్టె దానికి బ్రహ్మరథం
బంగారు గుడ్లు పెట్టే
పరిశ్రమలు హస్తగతం
మొత్తం ఒక ప్రైవేట్
మార్కెట్ ఎకానమీ
ఆశ్రిత పెట్టుబడి
అందులో బినామి
చట్టం దాని చుట్టూ
సంరక్షణ వలయం
పేరుకే రాజ్యాంగం
ప్రజాస్వామ్య నిలయం
అధికారం బుల్లెట్టయి
అహింసను తింటుంది
పరిపాలన విధ్వంసం
ప్రతీకారం కంటుంది
దీనంగా డెమోక్రసి
దిక్కులను చూస్తుంది
నియంతృత్వ రాజ్యపు
నీడలను మోస్తుంది
– వేల్పుల నారాయణ, 94404 33475
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

