ఓ..వరుణ దేవుడా
కరుణించి పంటల కాపాడ రావా
ధరణి మీనా చినుకువై
దయ చూప రారాదా?
చినుకువై మా చెంత
చింత తీర్చుపోరాదా?
కురువమ్మా ఓ..వానమ్మ
కునుకు లేక రైతులు కుమిలిపోతున్నరు
వాన జాడలు కనబడట్లేదు
ఆకాశంలో మబ్బులు లేవు
మళ్లీ కరువు పాటలు రాయాల్సిందేనా?
కురువని వానల కోసం కూలీ పేదల కోసం
బతకలేని జీవుల బతుకు కోసం
వానలు కురవక ఎండిపోతున్న పంటలు
మొలకెత్తని ఇత్తుల కోసం రైతుల చింతన
కాలువల్లో నీళ్లను చూసి
కాపుదనం చేసిన కర్షకుడు
నేడు నీళ్లు బందైపోతే గోసపడుతున్నడు
కాలువల్లో నీళ్లు రాక కరెంటు చక్కగా లేక
ఆరుతడి పంటలతో అన్నదాతల అవస్థలు
అరిగోస పడుతున్న రైతన్నకు ఏమిచ్చే సర్కార్
సమస్యలను సాగదీసుడు తప్ప
సాగు బాగు కోసం ఆలోచించిందెప్పుడు?
– దేవరపాగ కృష్ణయ్య 9963449579