ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలోని రూమ్ నెంబర్ 133లో ఈనెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్ జరుగనున్నదని తెలుగు లిటరరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ చింతకింది కాశీం తెలిపారు.
డిజిటల్ యుగంలో యువ రచయితల సాహిత్య సృజన కేంద్రంగా జరుగనున్న ఈ సదస్సులో మొత్తం 10 సెషన్లు ఉంటాయని తెలిపారు. ఈ రెండవ కాంగ్రెస్‌కు డైరెక్టర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం, కన్వీనర్‌గా తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకర శర్మ వ్యవహరిస్తారని తెలిపారు.